తమిళ్ సినిమాలు మారాల్సిన సమయం వచ్చిందా?

Is it Time for Kollywood Films to Change?
x

తమిళ్ సినిమాలు మారాల్సిన సమయం వచ్చిందా? 

Highlights

తమిళ్ సినిమాలు మారాల్సిన సమయం వచ్చిందా?

Kollywood: ప్రస్తుతం సౌత్ ఇండియా లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా టాలీవుడ్ హవా బాగానే నడుస్తోంది. మిగతా అన్ని భాషల సినిమాలతో పోలిస్తే తెలుగు సినిమాలకి ఉన్న క్రేజ్ ఈమధ్య బాగా పెరిగింది. "బాహుబలి", "ఆర్ ఆర్ ఆర్", "పుష్ప" వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా పేరు ను మారు మ్రోగిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తమిళ సినిమాల గురించి చర్చ మొదలైంది.

కన్నడ, మలయాళం సినిమాలు కూడా మంచి పేరు తెచ్చుకుంటుంటే, తమిళ సినిమాలు మాత్రం ప్రేక్షకులను అంత మెప్పించలేకపోతున్నాయి అనే వాదన వినిపిస్తోంది.పొన్నియిన్ సెల్వన్, విక్రమ్ వంటి సినిమాలు తమిళ్ లో బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. పొన్నియిన్ సెల్వన్ హిందీలో 22 కోట్ల కలెక్షన్లు నమోదు చేసుకోగా, విక్రమ్ హిందీలో 11 కోట్ల కలెక్షన్లు నమోదు చేసుకుంది.

అయితే తెలుగులో మీడియం రేంజ్ హీరో నిఖిల్ హీరోగా నటించిన "కార్తికేయ 2" హిందీ లో 30 కోట్ల కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఈ నేపద్యంలో తమిళ్ డైరెక్టర్లు కూడా ప్యాన్ ఇండియన్ సినిమా లు తీయడం మొదలు పెట్టాలని, లేకపోతే 1000 కోట్లు నమోదు చేసే సినిమా ఇప్పట్లో రావడం కష్టం అని కొందరు అంటున్నారు. మరి ఇప్పటికైనా తమిళ్ లో మంచి సినిమాలు వస్తాయా లేదా చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories