logo
సినిమా

'ఫలానా అబ్బాయి' గా నాగశౌర్య

ఫలానా అబ్బాయి గా నాగశౌర్య
X
Highlights

'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' సినిమాల తరువాత యంగ్ హీరో నాగ శౌర్య, యాక్టర్ మరియు డైరెక్టర్ శ్రీనివాస్...

'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' సినిమాల తరువాత యంగ్ హీరో నాగ శౌర్య, యాక్టర్ మరియు డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల కాంబో మళ్ళీ రిపీట్ అవ్వనుంది. తాజాగా 'నర్తనశాల' సినిమాతో డిజాస్టర్ అందుకున్న నాగశౌర్య ఇప్పుడు తదుపరి సినెమాలపై ఫోకస్ పెట్టాడు. నందిని రెడ్డి దర్శకత్వంలో 'ఓ బేబీ' అనే సినిమా మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్న శౌర్య, శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ చిత్రం కోసం ఓ సరికొత్త టైటిల్ ను అనుకుంటున్నారు. 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' అనే టైటిల్ ను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అవసరాల స్టైల్ లోనే ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం విశ్వసిస్తోంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. మరి వరుస ఫ్లాపులతో సతమవుతున్న నాగ శౌర్య కెరీర్ కు ఈ సినిమా ఎంతవరకు కలిసివస్తుందో వేచి చూడాలి.

Next Story