Dil Raju: తన మాట వల్ల తనే బుక్ అయిన దిల్ రాజు

Dil Raju: ప్రస్తుతం టాలీవుడ్ లో వున్న స్టార్ ప్రొడ్యూసర్ లలో ఒకరు దిల్ రాజు.

Arun Chilukuri
Updated on: 3 Nov 2022 9:00 PM IST
Is Dil Raju in Trouble With Varasudu Film
X

Dil Raju: తన మాట వల్ల తనే బుక్ అయిన దిల్ రాజు

Dil Raju: ప్రస్తుతం టాలీవుడ్ లో వున్న స్టార్ ప్రొడ్యూసర్ లలో ఒకరు దిల్ రాజు. టాలీవుడ్ షూటింగ్ ల బంద్ సమయంలో కూడా గిల్డ్ తరుపున ముందు నిలబడిన నిర్మాత దిల్ రాజే. ఇండస్ట్రీలో నిర్మాతలకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఎప్పటికప్పుడు తన గళం ఎత్తుతూ, అందరితో చర్చలు జరపడం తెలిసిందే. ఈ విషయంలో యాక్టీవ్ గా వ్యవహరించిన దిల్ రాజు మాత్రం గతంలో తాను అన్న మాటల కారణంగా ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితిలో పడిపోయినట్టుగా తెలుస్తోంది.

గతంలో షూటింగ్ ల బంద్ సమయంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన "దసరా" షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. కానీ దిల్ రాజు నిర్మిస్తున్న "వారసుడు" షూటింగ్ మాత్రం ఆగలేదు. అదేంటని అడగగా, విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మిస్తున్న "వారసుడు" డబ్బింగ్ సినిమా అని షూటింగ్ లు నిలిపి వేస్తున్నది స్ట్రెయిట్ తెలుగు సినిమాల ది మాత్రమే అని ఏదో లాజిక్ చెప్పారు. అయితే ఇప్పుడు అదే దిల్ రాజుకు ఇబ్బంది కలిగిస్తోంది.

నిన్న మొన్నటి దాకా ఇది డబ్బింగ్ సినిమా అని దబాయించిన దిల్ రాజు ఇప్పడు అదే సినిమాని సంక్రాతి బరిలో తెలుగు సినిమాలకు పోటీగా రిలీజ్ చేయబోతున్నారు. అసలు పండగ సీజన్ లలో తెలుగు సినిమాలకు పోటీగా రిలీజ్ చేయకూడదని వాదించిన దిల్ రాజు ఇప్పడు తానే డబ్బింగ్ సినిమాని సంక్రాంతి బరిలో దింపుతూ షాక్ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story