Allu Arjun Remuneration: అల్లు అర్జున్‌కు రూ. 300 కోట్ల పారితోషికమా?

Allu Arjun Remuneration
x

Allu Arjun Remuneration

Highlights

Allu Arjun Remuneration For Pushpa 2 Movie: పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.300 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు అన్నవార్త సంచలనంగా మారింది.

Allu Arjun Remuneration For Pushpa 2 Movie: పుష్ప 2 ట్రైలర్‌ ఈవెంట్‌తో ఉత్తరాదిలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ట్రైలర్ సెకండ్స్‌లోనే మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని యూట్యూట్‌లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ సినిమా ట్రైలర్ వేడుక బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగింది. ఈ వేడుకతో అల్లు అర్జున్ అరుదైన రికార్డు దక్కించుకున్నాడు. ఈ వేడుకకు 2 లక్షల మందికి పైగా హాజరు అయినట్టు సమాచారం. 2011లో షారూఖ్ నటించిన డాన్ సినిమాకి పాట్నాలో ఇదే రేంజ్‌లో అభిమానులు వచ్చారని బాలీవుడ్ మీడియా చెబుతోంది.

ఇప్పుడు మళ్లీ అదే రేంజ్‌లో అల్లు అర్జున్ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్లో కనిపించడంతో ఇండియాకి కొత్త సూపర్ స్టార్ వచ్చాడని.. షారూఖ్ తర్వాత ఆ రేంజ్ ఉన్న హీరో అల్లు అర్జున్ మాత్రమేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ముంబై పుష్ప 2 ప్రమోషన్స్‌లో భాగంగా షారూఖ్ ఖాన్ చీఫ్ గెస్ట్‌గా హాజరు కాబోతున్నట్టు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే.. ముంబై మొత్తం అట్టుడికిపోవడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక అల్లు అర్జున్ రెమ్యునరేషన్ విషయానికొస్తే.. పుష్ప 2 మూవీపై భారీ అంచనాల నేపథ్యంలో అందరి దృష్టి అల్లు అర్జున్ రెమ్యునరేషన్‌పై పడింది. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.300 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు అన్నవార్త సంచలనంగా మారింది. పారితోషికం విషయంలో రజనీకాంత్, షారూఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలను అల్లు అర్జున్ బీట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్ హీరో అల్లు అర్జున్ అని నెటిజెన్స్ చెప్పుకుంటున్నారు. పుష్ప తర్వాత అల్లు అర్జున్ పాపులారిటీ, డిమాండ్ పెరగడంతో రెమ్యూనరేషన్ ఈ రేంజ్‌లో పెరిగిందని టాక్ వినిపిస్తోంది.

ఇది వరకు ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో ప్రభాస్, షారూఖ్ ఖాన్, రజనీకాంత్, విజయ్ వంటి స్టార్స్ ఉన్నారు. ఒకవేళ అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ఏకంగా రూ.300 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు వస్తోన్న వార్తలు నిజమే అయితే, వాళ్లందరినీ వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచే హీరో కూడా ఆయనే అవుతారు.

అయితే, చాలా సందర్భాల్లో హీరో, హీరోయిన్స్ రెమ్యునరేషన్ గురించి రూమర్స్ తప్పించి అధికారిక సమాచారం అందుబాటులో ఉండదనే విషయం కూడా మర్చిపోవద్దు అంటున్నారు ఈ వార్తలతో విభేదిస్తున్న నెటిజెన్స్. ఇన్‌కమ్ టాక్స్ సమస్యల దష్ట్యా సినీ ప్రముఖులు అసలు పారితోషికాన్ని ఎప్పుడూ వెల్లడించరు అనే అభిప్రాయం కూడా ఉంది. మరోవైపు ఇదంతా పుష్ప 2 మూవీ కోసం జరుగుతున్న ప్రచారంలో భాగం కూడా అయ్యుండవచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories