బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇంట విషాదం

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇంట విషాదం
x
Irrfan's mother Saeeda Begum
Highlights

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి సయీదా బేగం మరణించారు.

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి సయీదా బేగం మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం (ఏప్రిల్ 25) ఉదయం తుది శ్వాస విడిచారు. అయితే లాక్ డౌన్ కారణంగా తన తల్లి చివరి చూపు కూడా ఇర్ఫాన్ చూడలేదని తెలుస్తోంది. దాంతో ఇర్ఫాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన తల్లికి నివాళులు అర్పించారు. ప్రస్తుతం ఆయన ముంబైలో ఉన్నారు. కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా, ఆయన తల్లి అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనలేకపోయారని కొన్ని ఆంగ్ల వెబ్ సైట్ లు పేర్కొన్నాయి.

కాగా సయీదాకు ముగ్గురు కుమారులు.. వారు.. ఇర్ఫాన్ , అతని సోదరులు సల్మాన్ , ఇమ్రాన్ లు.. ఇర్ఫాన్ సోదరుల్లో ఒకరు.. ఓ దినపత్రికతో మాట్లాడుతూ.. "నా తల్లి కొంతకాలంగా అనారోగ్యంతో ఉంది. అయితే శనివారం ఉదయం అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఇటీవల ఆమె ఇర్ఫాన్ భాయ్ ఆరోగ్యం గురించి ఆరా తీసింది." అని చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories