"మహేష్ బాబు నా ఫేవరెట్" అంటున్న ఐపీఎస్ ఆఫీసర్

IPS officer Safin Hasan Said I like Mahesh Babu Very Much
x

"మహేష్ బాబు నా ఫేవరెట్" అంటున్న ఐపీఎస్ ఆఫీసర్ 

Highlights

సినిమా చూడలేదు కానీ మహేష్ బాబు చాలా ఇష్టం అంటున్న ఐపీఎస్ ఆఫీసర్

Safin Hasan: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మహేష్ బాబుకి ప్రపంచవ్యాప్తంగా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా 22 ఏళ్లకే ఐపీఎస్ ఆఫీసర్ గా మారిన సఫీన్ హాసన్ తాను కూడా మహేష్ బాబు అభిమానిని అని చెప్తున్నారు. గుజరాత్ వాసి అయిన సఫీన్ ఇప్పుడు ప్రపంచంలోనే యువ ఐపీఎస్ ఆఫీసర్ గా మారి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ తన గమ్యాన్ని సాధించారు. ఈ నేపథ్యంలో ఇంస్టాగ్రామ్ లో మాట్లాడుతూ ఇప్పటిదాకా తాను ఒక్క మహేష్ బాబు సినిమా కూడా చూడలేదని కానీ తాను మహేష్ కి ఫ్యాన్ అయిపోయా అని చెప్పుకొచ్చారు.

మహేష్ బాబు సినిమాలు చూడక పోయినప్పటికీ ఆయన పర్సనాలిటీ మరియు ఆయన చేసిన మంచి పనుల వల్ల మహేష్ బాబు తన ఫేవరేట్ గా మారారని అన్నారు. బుర్రిపాలెం ఊరిని దత్తత తీసుకున్న మహేష్ బాబు ఊరి ప్రజలందరికీ కోవిడ్ వాక్సినేషన్ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఊరు మాత్రమేకాక తెలంగాణలోని సిద్ధపురం ఊరును కూడా మహేష్ బాబు దత్తత తీసుకున్నారు. అంతేకాకుండా ఇప్పటి దాకా వేలకొద్దీ పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించారు. ఇలా సినిమాలతో మాత్రమే కాకుండా మహేష్ బాబు తన మంచితనం మరియు మానవత్వం తో కూడా అభిమానులను పెంచుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories