NTR 30 Movie: ఎన్టీఆర్30 సినిమా గురించిన ఆసక్తికరమైన అప్డేట్

Interesting Update about NTR 30 Movie | Tollywood News
x

NTR 30 Movie: ఎన్టీఆర్30 సినిమా గురించిన ఆసక్తికరమైన అప్డేట్

Highlights

NTR 30 Movie: ఎన్టీఆర్30 సినిమా గురించిన ఆసక్తికరమైన అప్డేట్

NTR 30 Movie: "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుండి సినిమా ఎలా ఉండబోతోంది, ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక మరోవైపు ఇంకా సినిమా కోసం హీరోయిన్ ను కూడా ఖరారు చేయాల్సి ఉంది. యువసుధ ఆర్ట్స్ పతాకంపై పై కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్న ఈ సినిమాను సుధాకర్ మిక్కిలినేని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్ర తదుపరి అప్‌డేట్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నవంబర్ 12న సెట్స్ పైకి వెళ్లనుంది అని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నో మార్పులు మరియు చర్చల తర్వాత ఎట్టకేలకు కొరటాల సినిమా కి స్క్రిప్ట్‌ను పూర్తి చేసాడు అని తెలుస్తోంది. ఇక కథ మళ్లీ విన్న ఎన్టీఆర్ ఫైనల్ గా స్క్రిప్ట్ కి ఓకే చెప్పారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ డిఫరెంట్ గా మరియు స్టన్నింగ్ గా, చాలా స్టైలిష్ గా ఉండబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా బరువు తగ్గారు. తారక్ కూడా తన పాత్ర కోసం కొత్త లుక్‌తో అదరగొట్టనున్నాడు. ఈ చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories