నాగచైతన్య సినిమా కోసం ఆసక్తికరమైన టైటిల్ ఖరారు

Interesting Title for Naga Chaitanya’s Next Film | Tollywood
x

నాగచైతన్య సినిమా కోసం ఆసక్తికరమైన టైటిల్ ఖరారు

Highlights

*నాగచైతన్య సినిమా కోసం ఆసక్తికరమైన టైటిల్ ఖరారు

Naga Chaitanya Movie Title: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి సినిమాలతో మంచి హిట్లు అందుకున్నారు. కానీ ఈ మధ్యనే విడుదలైన "థాంక్యూ" సినిమాతో మాత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయారు. అయితే ప్రస్తుతం నాగచైతన్య చేతిలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్న నాగచైతన్య ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమాకి ఒక ఆసక్తికరమైన టైటిల్ ను అనుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. "302" అనే టైటిల్ ను సినిమాకి పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.ఇక ఈ సినిమాకి దాదాపు ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. సినిమా కథ ఆధారంగా ఈ టైటిల్ ను దర్శక నిర్మాతలు అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో స్క్రీన్ ప్లే చాలా గ్రిప్టింగ్ గా ఉండబోతుందని నాగచైతన్య పాత్ర మరియు కథని డీకోడ్ చేసేలాగా ఈ 302 అనే నంబర్ ఇండికేషన్ అని కొందరు చెబుతున్నారు.

ఇక సినిమాలో ఎక్కువగా సన్నివేశాలు గ్యాంగ్ స్టర్ లతో సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. కోలీవుడ్ నటుడు జీవా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రియమణి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories