రవితేజ సినిమాకి నో చెప్పిన రాములమ్మ?

anil ravipudi
x
anil ravipudi
Highlights

ప్పటికే విడుదల చేసిన లుక్ లో ఆమె చాలా హుందాగా కనిపిస్తున్నారు. ఇక చిత్ర టిజర్ లో కూడా గాయపడిన

లేడి అమితాబ్ గా విజయశాంతికి టాలీవుడ్ లో మంచి పేరుంది. 2006 లో వచ్చిన నాయుడమ్మ సినిమా తర్వాత మళ్ళీ ఆమె మొఖానికి మేకప్ వేసుకుంది లేదు.. సినిమాల నుండి రాజకీయాల్లోకి వెళ్లి ఎంపీగా గెలిచి అక్కడే సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత ఆమెను సినిమాల్లో నటించాలని చాలా మంది కోరారు. ఈ నేపధ్యంలో చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది విజయశాంతి..

ఆర్మీ అధికారిగా మహేష్ నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి ఓ కీలక పాత్రలో మేరవనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లుక్ లో ఆమె చాలా హుందాగా కనిపిస్తున్నారు. ఇక చిత్ర టిజర్ లో కూడా గాయపడిన వాడే బాబాయ్ సహాయం చేస్తాడంటూ ఆమె చెప్పే డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇది ఇలా ఉంటే రాజా ది గ్రేట్ సినిమాలోనే రవితేజ తల్లిగా విజయశాంతిని తీసుకోవాలని అనిల్ రావిపూడి అనుకున్నాడని ఓ వార్త ఫిలిం నగర్ లో హాల్ చల్ చేస్తుంది. కానీ ఆమె దీనికి ఒప్పుకోకపోవడంతో ఆమె ప్లేస్ లో నటి రాధికను తీసుకున్నారని ఓ వార్త వస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో దర్శకుడే తేల్చాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories