సైరా క్లైమాక్స్ లో పవన్ , అనుష్క... ? సినిమాకి హైలైట్

సైరా క్లైమాక్స్ లో పవన్ , అనుష్క... ? సినిమాకి హైలైట్
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహరెడ్డి.. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజ్ చేసిన...

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహరెడ్డి.. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజ్ చేసిన సినిమా మేకింగ్ వీడియోస్, టిజర్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి. దీనికి తోడు సినిమాలోని యుద్ద సన్నివేశాలను హైలేట్ చేస్తూ మరో ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. అయితే సినిమాలోని క్లైమాక్స్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ చర్చ నడుస్తుంది.

నిజానికి కథలో బ్రిటిష్ వాళ్ళు ఉయ్యాలవాడ నరసింహరెడ్డిని ఉరి తీశారు. ఇక్కడ కూడా చిరంజీవి కూడా ఉరి తీసే సన్నివేశాలను తెరకెక్కించారు. దీనితో అభిమానులకు ఆ సన్నివేశాన్ని ఎంతవరకు జీర్ణించుకుంటారు అన్నది ఆసక్తిగా మారనుంది. అందుకే సైరా నరసింహారెడ్డి చేసిన పోరాటం,అయన నింపిన స్ఫూర్తితో బ్రిటిష్ వాళ్ళపై పోరాటానికి ఝాన్సీ లక్ష్మిభాయ్‌ రంగంలోకి దిగుతుందని టాక్ నడుస్తుంది. ఈ పాత్రని హీరోయిన్ అనుష్క పోషిస్తుంది. కనిపించేది కొద్దిసేపు అయిన సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెప్పుకొస్తుంది.

దీనికి తోడు చివరలో పవన్ కళ్యాణ్ వాయిస్ తో సినిమా ఎండ్ అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమాని గాంధీ జయంతీ సందర్బంగా అక్టోబర్ రెండున విడుదల చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories