Top
logo

Vakeel Saab Superwoman: 'వకీల్ సాబ్' సూపర్ ఉమెన్ గురించి మీకు తెలుసా..?

Super Women Lirisha
X

సూపర్ విమెన్ లిరీష

Highlights

Vakeel Saab Superwoman: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ గత వారం ప్రచంచవ్యాప్తంగా విదుదల అయిన సంగతి తెలిసిందే.

Vakeel Saab Superwoman: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ గత వారం ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ పాత్ర అందరిని ఆకర్షించింది. ఆ పాత్ర లెన్త్ తక్కువే ఐనా..సినిమా క్లైమాక్స్ మొత్తం మలుపు తిప్పే పాత్ర అది. ఈ క్యారెక్టర్ చేసిన నటిని ప్రేక్షకులు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఆ పాత్ర పేరు సూపర్ ఉమెన్.. ఇప్పుడు గుర్తువచ్చిందా.? ఆ పాత్ర ఏదో? ఇక ఈ సినిమా విడుదల తర్వాత ఈ సూపర్‌ ఉమెన్ పాపులర్ అవుతుంది. సూపర్‌ ఉమెన్ ఎలా వచ్చింది? ఆమె ఎవరు అనేది తెలుసుకోవాని ఉందా? దాని వెనుక అసలు కథ ఎంటో చూద్దాం.

ఆ క్యారెక్టర్ చేసిన సూపర్‌ ఉమెన్ పేరు సరళాదేవి. అసలు సూపర్ ఉమెన్ అని పేరు రావడానికి కారణం పవన్ కళ్యాణే అంటుంది. ఇక ఈ సరళాదేవి అలియాస్ లిరీష రెడ్డి. మెగా స్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రంలో సునీల్ ని పెళ్లి చేసుకునే అమ్మాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు మూవీస్, సీరియల్స్ చేసింది. ఇక వకీల్ సాబ్ లో చిత్రంలో లేడీ ఎస్ఐ పాత్రలో చేసింది. ఆమె చేసింది చిన్న పాత్రే అయినా.. 'వకీల్ సాబ్' కోర్టులో కేసు గెలవడానికి ఆమె పెట్టిన తప్పుడు కేసు. రెండు లైన్లు రాసిన ఎఫ్ఐఆర్ కాపీ కీలకమైంది. అల్వాల్‌లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మెయినాబాద్‌ పోలీస్ స్టేషన్‌కి 15 నిమిషాల్లో వచ్చేశావమ్మా.. అని వకీల్ సాబ్ అన్నప్పుడు.. 'సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా.. ఏదైతే అది అయ్యిందని జెట్ స్పీట్‌తో వచ్చేసినా సార్' అని ఆమె చెప్పడం... వకీల్ సాబ్ వహ్ అని వెటకారంగా అనడం థియేటర్‌లో ఫన్ జనరేట్ అయ్యింది.

వకీల్ సాబ్ ఆమెను కోర్టు బోనులో నిలబెట్టి సూపర్‌ర్‌ర్‌ర్ ఉమెన్ అని నొక్కి పలకడం భలే చతమత్కారంగా అనిపిస్తుంది. కాగా వకీల్ సాబ్ చిత్రంలో మహిళా ఎస్‌ఐగా నటించిన ఆ సూపర్ ఉమెన్ ఈ సినిమా సక్సెస్ కావడంతో ఫుల్ ఖుషీలో ఉంది. ఈ సందర్భంగాఈ సూపర్ ఉమెన్ ఓ ఇంటర్వ్యూలో సినిమాపై పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో తెలియజేసింది.

పవన్ కళ్యాణ్ చాలా సింపుల్‌గా ఉంటారని చెప్పుకొచ్చింది. షూటింగ్‌లో హంగామా ఏమీ ఉండదు.. చాలా సింపుల్‌గా వచ్చేస్తారు.. ఇక్కడ ఉంటే ఏమైందిలే అని అంటారు.. ఏదీ స్పెషల్‌గా ట్రీట్ చేయాలని అనుకోరు. చాలా సరదాగా ఉంటారు. ఆ డైలాగ్ బాగా పేలిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. 'సూపర్ ఉమెన్' అనే డైలాగ్ అసలు లేదు.. ఆమెను ఏదైనా స్పెషల్‌గా పిలవాలి అని చెప్పేసి.. ఆయనే సూపర్ ఉమెన్ అన్నారు.. ఆ వర్డ్ ఆయన నోటి నుంచి అప్పటికప్పుడు వచ్చింది. పవన్ కళ్యాణ్ స్టైల్‌లో 'సూపర్ ఉమెన్' అని అంటుంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఏంటమ్మా అని గురాయించి చూస్తున్నావ్ అనే డైలాగ్ వేశారు. నిజానికి ఆ డైలాగ్ స్క్రిప్ట్‌లో లేదు. ఆయన ఆ డైలాగ్ చెప్పగానే నేను నిజంగానే అలా చూస్తున్నానా అనుకుని వెంటనే నవ్వేశాను.. మళ్లీ టేక్ తీసుకున్నారు.. ఆయన ఏమీ అనలేదు.. చాలా ప్రోత్సహిస్తారు ఆయన. ఇబ్బంది పడొద్దని చెప్తారు అంటూ పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పింది వకీల్ సాబ్ సూపర్ ఉమెన్ సరళా దేవి. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నివేథా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషించారు. ప్రకాశ్ రాజ్ మరో సారి లాయర్ ‌నందగా అద్భుతంగా నటించారు. హిందీ చిత్రం పింక్ రీమేక్ గా ఈ మూవీ తెలుగులో తెరకెక్కింది. విడుదలైన తొలి రోజు నుంచే వకీల్ సాబ్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.


Web TitleInteresting Facts About Vakeel Saab Movie Superwoman Sarala Devi Alias Lirisha
Next Story