Oy: ‘ఓయ్‌’ టైటిల్‌ అర్థమిదే.. మీరు గమనించారా?

Interesting Facts About OY Movie Title
x

Oy: ‘ఓయ్‌’ టైటిల్‌ అర్థమిదే.. మీరు గమనించారా?

Highlights

Oy: కొన్ని సినిమాలు రిలీజ్ అయిన వెంటనే విజయం సాధించకపోయినా. తర్వాత టీవీ, యూట్యూబ్, ఓటీటీలలో వచ్చిన తర్వాత కొని సినిమాలు కల్ట్ క్లాసిక్ గా మారిపోతాయి.

Oy: కొన్ని సినిమాలు రిలీజ్ అయిన వెంటనే విజయం సాధించకపోయినా. తర్వాత టీవీ, యూట్యూబ్, ఓటీటీలలో వచ్చిన తర్వాత కొని సినిమాలు కల్ట్ క్లాసిక్ గా మారిపోతాయి. ఎన్ని సార్లు చుసిన మల్లి మల్లి చూడాలి అనిపిస్తాయి. అలంటి సినిమాలో ''ఓయ్'' సినిమా ఒకటి. సిద్ధార్థ్‌, షామిలీ, జంటగా నటించిన రొమాంటిక్‌ డ్రామా చిత్రమిది.

సినిమాలో హీరోయిన్, హీరోని మొదటిసారి చూసినపుడు ''ఓయ్'' అనే పిలుస్తుంది. అంతే కాకుండా సినిమా మొత్తం ''ఓయ్'' అంటూనే ఉంటుంది. అందుకనే ఈ మూవీ కి ఓయ్ అనే టైటిల్ పెట్టారు అని అందరూ అనుకుంటారు. ఇది ఒక్క కారణం ఐతే దీని వెనకాల ఇంకో ఆసక్తికరమైన కారణం వుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14కి రీరిలీజ్‌ కానున్న సందర్భంగా దర్శకుడు ఆనంద్‌ రంగ ఆ విశేషాన్ని పంచుకున్నారు.

మణిరత్నం సినిమాల్లో హీరోయిన్ లు హీరోలని చాలా వరకు ఓయ్ అనే పిలుస్తుంటారు. దాని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ''ఓయ్'' ని హైలైట్ చేస్తూ ఈ సినిమా కథ ని రాసుకున్నారు. ఇందులో సంధ్య (షామిలీ).. ఉదయ్‌ (సిద్ధార్థ్‌)ని పేరుతోకాకుండా ఓయ్‌ అనే పిలుస్తుంటుంది. ఓయ్ టైటిల్ దీని పరంగానే కాకుండా కథ పరంగా కూడా సెట్ అవుతుంది అని డైరెక్టర్ చెప్పారు అది ఎలాగో ఇపుడు చూదాం.

సంధ్య, ఉదయ్‌ల ప్రేమ 2007 జనవరి 1న (ఉదయ్‌ పుట్టినరోజు) మొదలవుతుంది. ఉదయ్‌ తండ్రి సంక్రాంతి సమయంలో మరణిస్తాడు. మరోవైపు, వాలంటైన్స్‌ డే, హోలీ, వినాయక చవితి, క్రిస్మస్‌.. ఇలా పండగలకు సంబంధించి సన్నివేశాలతో కథ ముందుకు వెళ్తూవుంటుంది. సంధ్య క్యాన్సర్‌తో పోరాడి 2008 జనవరి 1న మరణిస్తుంది. 2007 జనవరి 1న స్టార్ట్ అయి 2008 జనవరి 1న ముగుస్తుంది. సంవత్సరం పాటు జరిగే ప్రేమకథ కావడం తో ఇంగ్లీష్ లో ఓయ్ అని పెట్టారు. One Year- OY! అని అర్థం. మరి, ఈ సినిమా చూసినప్పుడు దానిని మీరు గమనించారా..?

Show Full Article
Print Article
Next Story
More Stories