ఎన్టీఆర్‌ అభిమానుల వినూత్న ఆలోచన.. ఏ హీరో ఫ్యాన్స్ చేయలేదు !

ఎన్టీఆర్‌ అభిమానుల వినూత్న ఆలోచన.. ఏ హీరో ఫ్యాన్స్ చేయలేదు !
x
ఎన్టీఆర్ ఫ్యాన్స్
Highlights

ఎన్టీఆర్ అభిమానులు ఓ వినూత్న ఆలోచన చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఛారిటీస్ పేరుతో ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

ఏ స్టార్ హీరోకి లేని అభిమాన గణం ఎన్టీఆర్‌కు ఉంది. అందరి హీరోల అభిమానులు ఎన్టీఆర్‌ను గౌరవిస్తారు. ఆయన సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. ఎన్టీఆర్ కూడా ఏ ఆడియో ఫంక్షన్‌కు వెళ్లిన అభిమానులను జాగ్రత్తాగా ఇంటికి వెళ్లమని, మీ కుంటుంలో వారు మీ కోసం ఎదురుచూస్తుంటారని పదే పదే చెబుతుంటారు. అందుకేనేమో అందరి హీరోల ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ ప్రత్యేకమైన ఇష్టం ఉంటుందన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సారి ఎన్టీఆర్ అభిమానులు ఓ వినూత్న ఆలోచన చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఛారిటీస్ పేరుతో ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ సారి ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకను వీనూత్నంగా జరపాలని నిర్ణయించారు. మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు నుంచి వంద రోజుల వరకు వేడుకలు ఘనంగా నిర్వహించాలని చూస్తున్నారు. అంతేకాదు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాని నిర్ణయించారు. హీరోల కోసం అభిమానులు కనుకలు ఇవ్వడం, వారి పుట్టిన రోజు నాడు రక్త దానాలు చేయడం చూశాం. కానీ.. ఇలా ఏకంగా వంద రోజులు పుట్టినరోజు నిర్వహించాలని నిర్ణయించడం గ్రేట్ అనే చెప్పాలి. ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఐతే ఎన్టీఆర్ త్వరలో రాజకీయాలలోకి రావాలని కోరుకుంటున్నారు.

ఇక దర్శధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్‌ఆర్ఆర్‌లో ఎన్టీఆర్, రాం చరణ్, హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 8, 2021 లో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాని జూలై 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కాగా.. జవవరి 08- 2021కి వాయిదా వేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories