ప్రియదర్శి In The Name of God టీజర్‌

InTheNameofGod  teaser Out Now
x

In THE Name OF GOD FIle Photo

Highlights

In The Name of God: తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించ‌డానికి ఓటీటీ ప్ర‌పంచంలోకి అడుగుపెట్టింది ''ఆహా''

In The Name of God: తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించ‌డానికి ఓటీటీ ప్ర‌పంచంలోకి అడుగుపెట్టింది ''ఆహా''. 100% తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అనే నినాదంలో వ‌చ్చిన ఆహా.. సినిమాలు , ఒరిజినల్స్, వెబ్ సిరీస్ లు, స్పెషల్ షోలతో వీక్షకులను అలరిస్తోంది. క్రాక్, నాంది, జాంబిరెడ్డి, గాలి సంప‌త్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాలు ఇప్ప‌టికే స్ట్రీమ్ అవుతున్నాయి. కాగా. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని అందిస్తూ ఆదరణ పొందుతున్న 'ఆహా' ఓటీటీ.. మ‌రోసారి ఈ స‌మ్మ‌ర్ లో ఫుల్ ఎంట‌ర్ టైన్ చేయ‌నుంది.

ఆహాలో ఇప్పుడు 'ఇ న్ ది నేమ్ ఆఫ్ గాడ్' (ఐ.ఎన్.జి) అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని రెడీ చేసింది. అయితే ఇన్నాళ్లూ తన కామెడీతో నవ్వించిన ప్రియదర్శి.. ఇందులో సీరియస్ రోల్ లో కనిపించబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ''ఐ.ఎన్.జి'' సిరీస్ లో కమెడియన్ ప్రియదర్శి లీడ్ రోల్ పోషిస్తున్నారు. హీరోయిన్ గా నందినీ రాయ్ నటిస్తోంది. అనౌన్స్ మెంట్ తోనే ఆసక్తిని కలిగించిన మేకర్స్.. తాజాగా 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ టీజ‌ర్ విడుదల చేశారు. కొత్త దర్శకుడు విద్యాసాగర్ ముత్తుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ అంచ‌నాలు పెంచింది.

ఇక టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే.. జ‌గ‌ప‌తి బాబు వాయిస్ ఓవ‌ర్ తో స్టార్ట్ అయ్యే టీజ‌ర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. 'ఈ ఉడత‌ని ఎలా ప‌ట్టుకుంటారో తెలుసా?ఒక చెట్టుకి చిన్న తొర్ర చేసి అందులో దానికి ఆహారం వేస్తారు. ఉడ‌త అందులో త‌ల దూరుస్తుంది. తిరిగి బ‌య‌ట‌కు రాలేదు. అప్పుడు దాన్ని ఈజీగా బ‌య‌ట‌కు తీస్తారు' అంటూ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ త్వరలో 'ఆహా' ఓటీటీలో విడుదల కానుంది. సురేష్ కృష్ణ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ''ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్'' (ఐ.ఎన్.జి) క్రైమ్ థ్రిల్లర్ కి కొవరుణ్ డీకే సినిమాటోగ్రఫీ అందించగా.. నిఖిల్ శ్రీకుమార్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. దీపక్ అలెగ్జాండర్ సంగీతం సమకూరుస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories