Bigg Boss 9: నామినేషన్స్ లిస్ట్‌లో 10 మంది..ఇమ్మూ దూకుడు, భరణిపై లేడీ గ్యాంగ్ ఫైర్

Bigg Boss 9: నామినేషన్స్ లిస్ట్‌లో 10 మంది..ఇమ్మూ దూకుడు, భరణిపై లేడీ గ్యాంగ్ ఫైర్
x

Bigg Boss 9: నామినేషన్స్ లిస్ట్‌లో 10 మంది..ఇమ్మూ దూకుడు, భరణిపై లేడీ గ్యాంగ్ ఫైర్

Highlights

బిగ్‌బాస్ సీజన్ 9 ఐదో వారంలోకి అడుగుపెట్టింది. హౌస్‌లో మొదట్నుంచీ ఇమ్మానుయేల్ ఆటతీరు రోజురోజుకూ మెరుగుపడుతోంది.

Bigg Boss 9: బిగ్‌బాస్ సీజన్ 9 ఐదో వారంలోకి అడుగుపెట్టింది. హౌస్‌లో మొదట్నుంచీ ఇమ్మానుయేల్ ఆటతీరు రోజురోజుకూ మెరుగుపడుతోంది. మొన్న వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున నుంచి గోల్డెన్ స్టార్ అందుకున్న ఇమ్మూ.. తాజాగా జరిగిన ఇమ్యూనిటీ టాస్క్‌లోనూ గెలిచి ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడు. మరోవైపు, మొదట్లో బాగా కనిపించిన భరణి గ్రాఫ్ ఈ వారం పూర్తిగా తగ్గింది. ముఖ్యంగా, తనూజతో సాన్నిహిత్యం, ఆ తర్వాత దివ్యకు సపోర్ట్ ఇవ్వడంలో చూపిన గందరగోళం వల్ల లేడీ కంటెస్టెంట్స్ అంతా భరణిని టార్గెట్ చేసి కార్నర్ చేశారు.

సాధారణ నామినేషన్స్ ప్రక్రియకు బదులుగా, బిగ్‌బాస్ ఈ వారం ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. రామ్ (కెప్టెన్), ఫ్లోరా (రెండు వారాలు డైరెక్ట్ నామినేట్) మినహా మిగిలిన హౌస్‌మేట్స్ అందరినీ.. తనూజ, భరణి, రీతూ, సుమన్, దివ్య, పవన్, శ్రీజ, సంజన, కళ్యాణ్, ఇమ్మానుయేల్ – మొదటగా నామినేట్ అయినట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత, వారందరికీ గార్డెన్ ఏరియాలో ఉన్న పెద్ద బెడ్‌పై నిలబడి, ఒకరినొకరు కిందకి తోసే ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చాడు. చివరకు బెడ్‌పై మిగిలిన వారే సేఫ్ అవుతారని చెప్పాడు. ఈ టాస్క్‌కు కెప్టెన్ రామ్, ఫ్లోరా సంచాలకులుగా వ్యవహరించారు.

దివ్య తనకు ట్యాబ్లెట్స్ ఇస్తుండటంపై తనూజ అసూయ పడుతోందంటూ భరణి దివ్య దగ్గర మాట్లాడాడు. తాను దివ్యతో క్లోజ్‌గా ఉండడం వల్లే తనూజ ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతోందని చెప్పాడు. దీనికి దివ్య అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తన ఎమోషన్స్ ఎవరికీ పట్టవా అని ప్రశ్నిస్తూ భరణిపై కోపం చూపింది. మరోవైపు, సంజన ఫ్లోరాతో మాట్లాడుతూ, భరణి అన్న కావాలనే తనకూ, ఇమ్మూకూ మధ్య దూరం పెంచేందుకు ప్రయత్నించాడని, అందులో తను విజయవంతమయ్యాడని ఆరోపించింది.

ఇమ్యూనిటీ టాస్క్‌లో భరణి తనను బలంగా కిందకి తోసేయడంతో, శ్రీజ తీవ్రంగా స్పందించింది. "రేలంగి మావయ్యలా నటించకు అన్న, మంచోడిలా నటిస్తున్నావ్" అంటూ భరణిని నేరుగా విమర్శించింది. ఆడవాళ్లను అలా పట్టుకోకూడదు అని చెప్పే నువ్వు, తోసేటప్పుడు ఎందుకు పట్టుకున్నావని నిలదీసింది.

టాస్క్‌లో దివ్యను అవుట్ చేయడానికి అందరూ సహకరించడం, ముఖ్యంగా తనకు మద్దతుగా ఉంటాడనుకున్న భరణి సైలెంట్‌గా ఉండటం చూసి దివ్య ఎమోషనల్ అయ్యింది. "నేను నమ్ముకున్న మనుషుల గురించి ఏదైనా జరిగితేనే నాకు ఏడుపొస్తుంది, నాకు కనీసం సపోర్ట్ కూడా చేయలేకపోయారా" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. భరణి దీనికి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు.

బెడ్ పై నిలబడే టాస్క్‌లో మొదటగా సంజన, సుమన్ శెట్టి అవుట్ అయ్యారు. ఆ తర్వాత శ్రీజను కాపాడాలనుకున్న డీమాన్‌ పవన్ ను కళ్యాణ్, ఇమ్మూ, శ్రీజలు కలిసి నెట్టేయబోయినా డీమాన్ పవన్ పోరాడి, చివరికి పడిపోతూ భరణిని కూడా కిందకి లాగేశాడు. సంచాలకులు ఈ విషయంలో కొంత గందరగోళపడ్డారు. చివరికి రీతూని అవుట్ చేశారు.

ఆ తర్వాత మిగిలిన శ్రీజ, తనూజ, కళ్యాణ్, ఇమ్మూ, భరణిలకు గాలి నిప్పు నీరు అనే మూడు లెవెల్స్ ఉన్న ఫైనల్ ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో పేపర్ ప్లేన్స్ ఎగరేయడం, సుత్తితో ఫైర్ వచ్చేలా కొట్టడం, వాటర్ డ్రమ్‌లో నుంచి నీటిని ఫిష్ ట్యాంక్‌లోకి పంపి బ్రిక్ తీసుకోవడం వంటివి ఉన్నాయి. ఈ ప్రక్రియను ఇమ్మానుయేల్ చాలా వేగంగా పూర్తి చేసి ఇమ్యూనిటీ గెలుచుకున్నాడు.

కెప్టెన్ రామ్, ఇమ్యూనిటీ పొందిన ఇమ్మూ తప్ప మిగిలిన 10 మంది కంటెస్టెంట్స్ ఈ వారం హౌస్ నుంచి బయటికి వెళ్లడానికి నామినేషన్స్‌లో ఉన్నారు. ప్రస్తుతం రీతూ చౌదరికి ఓటింగ్ తక్కువగా ఉందని, ఈ సీజన్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories