Ileana D'Cruz: రెండోసారి తల్లి అయిన ఇలియానా

Ileana DCruz
x

Ileana D'Cruz: రెండోసారి తల్లి అయిన ఇలియానా

Highlights

Ileana D'Cruz: టాలీవుడ్‌లో ఓ దశలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన గోవా బ్యూటీ ఇలియానా అభిమానులతో ముచ్చటైన శుభవార్తను పంచుకున్నారు. ఆమె రెండోసారి తల్లయ్యారు. ఈసారి కూడా మగబిడ్డకు జన్మనిచ్చారు.

Ileana D'Cruz: టాలీవుడ్‌లో ఓ దశలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన గోవా బ్యూటీ ఇలియానా అభిమానులతో ముచ్చటైన శుభవార్తను పంచుకున్నారు. ఆమె రెండోసారి తల్లయ్యారు. ఈసారి కూడా మగబిడ్డకు జన్మనిచ్చారు.

ఈ సంతోషకరమైన విషయాన్ని ఇలియానా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. కుటుంబంలోకి చేరిన కొత్త అతిథిని ప్రపంచానికి పరిచయం చేస్తూ పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ఈ నెల 19న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా పోస్ట్‌ ద్వారా ఆ పాపాయికి ‘కియాను రాఫె డోలన్’ అనే పేరును పెట్టినట్లు ఆమె వెల్లడించారు. ఫొటోతో పాటు,

“మా కుటుంబంలోకి మా రెండో అబ్బాయి కియాను రాఫె డోలన్ కు హృదయపూర్వక స్వాగతం. మా హృదయాలు ఈ ఆనందంతో నిండిపోయాయి”

అంటూ ఇలియానా తన భావోద్వేగాన్ని పంచుకున్నారు.

ఈ వార్త తెలిసిన వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. పండంటి బిడ్డతో ఇలియానా జీవితంలో మరో అందమైన అధ్యాయం ప్రారంభమైందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories