30 రోజుల్లో ప్రేమించడం ఎలా?: స్నేహం కోసం చంద్రబోస్ రాసిన పాట విన్నారా?

30 రోజుల్లో ప్రేమించడం ఎలా?:  స్నేహం కోసం చంద్రబోస్ రాసిన పాట విన్నారా?
x
Highlights

ఛందస్సుల జిగిబిగితో సాగిపోతున్న తెలుగు సినీ పాటకు ఆయన కొత్త నడక నేర్పారు. ఏ కొద్దిమంది నోటనో వినిపిస్తున్న సినిమా పాటకు ఆధునికతను అద్ది..అందరి తోనూ పలికిన్చేలా చేశాడు. చిన్న చిన్న పదాల సరిగమలు.. ప్రాసల పదనిసలు.. ఆయన కలం నుంచి అలవోకగా జాలువారతాయి. తెలుగు సినీ పాటల రచయితలలో ఆయన చందమామలా మెరుస్తున్నారు. ఆయనే చంద్రబోస్.

ఛందస్సుల జిగిబిగితో సాగిపోతున్న తెలుగు సినీ పాటకు ఆయన కొత్త నడక నేర్పారు. ఏ కొద్దిమంది నోటనో వినిపిస్తున్న సినిమా పాటకు ఆధునికతను అద్ది..అందరి తోనూ పలికిన్చేలా చేశాడు. చిన్న చిన్న పదాల సరిగమలు.. ప్రాసల పదనిసలు.. ఆయన కలం నుంచి అలవోకగా జాలువారతాయి. తెలుగు సినీ పాటల రచయితలలో ఆయన చందమామలా మెరుస్తున్నారు. ఆయనే చంద్రబోస్. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అంటూ యువతరానికి లక్ష్యాన్ని నిర్దేశించినా.. "నువ్వు పిలిచేందుకే.. నాకు పేరున్నది, నిన్ను పిలిచేందుకే.. నాకు పిలుపున్నది" అంటూ ప్రేమికుల మనసును ఆవిష్కరించినా.."ప్రేమలు పుట్టేవేళ పగలంతా రేయేలే, ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే, ప్రేమే తోడుంటే పామైనా తాడేలే, ప్రేమే వెంటుంటే రాయైనా పరుపేలే" అని ప్రేమలో ఉన్నవాళ్ళ మానసిక స్థితిని వివరించినా అన్నీ తీయని అనుభూతులను కలిగించే పదాలే.

తాజ్ మహల్ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన చంద్రబోస్.. ఇంజనీరింగ్ పట్టభద్రుడైనా చిన్నప్పుడు నుండి పాటలమీద ఉన్న మక్కువతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఈయన పాటల రచయితనే కాక నేపథ్యగాయకుడు కూడా. తాజాగా అయన కలం నుంచి స్నేహం గొప్పతనాన్ని వివరించే పాట ప్రాణం పోసుకుంది. ఈ సందర్భంగా ఆ పాట రాసిన చంద్రబోస్ గురించి నాలుగు ముక్కలు.. దానితో పాటుగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటూ వెండి తెరను పలకరించాబోతున్న బుల్లితెర హీరో ప్రదీప్ కోసం చంద్రబోస్ రాసిన ఆ పాట లిరిక్స్ మీకోసం అందిస్తున్నాం! ఆస్వాదించండి..

సినీ ప్రస్థానం:

దర్శకుడు ముప్పలనేని శివ చంద్రబోస్ పాటలను నిర్మాత రామానాయుడుకి చూపించడంతో తాజ్‌మహల్ సినిమాలో మంచుకొండల్లోన చంద్రమా అనే పాట రాయడానికి అవకాశం వచ్చింది. ఆ పాట బాగా ప్రజాదరణ పొందింది. అదే సమయానికి ఇంజనీరింగ్ కూడా పూర్తయింది. ఉద్యోగమా, సినీరంగంలో రెండో దాన్నే ఎంచుకుని తల్లిదండ్రులను కూడా అందుకు ఒప్పించాడు. ఆ తరువాత కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్ళిసందడి సినిమాలో కూడా అవకాశం వచ్చింది. ఆ సినిమా సంగీత పరంగా కూడా విజయం సాధించడంతో ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. 800 సినిమాల్లో 3300 పాటల్లో పాటలు రాశాడు.

బడ్జెట్ పద్మనాభం చిత్రంలోని 'ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన', 'కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి' (ఠాగూర్), 'నవ్వేవాళ్లు నవ్వని ఏడ్చేవాళ్లు ఏడ్వనీ' (చెన్నకేశవరెడ్డి), 'లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ' (డాడీ), 'చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని' (నేనున్నాను), 'అభిమాని లేనిదే హీరోలు లేరులే', (కథానాయకుడు) వంటి పాటలెన్నో ఉన్నాయి.

స్నేహం గురించిన పాటలు:

ట్రెండు మారినా ఫ్రెండ్ మారడు (ఉన్నది ఒకటే జిందగీ), ఎగిరే ఎగిరే (కొచెం ఇష్టం కొచెం కష్టం)..ఎప్పటిలాగే ఇప్పుడు కూడా అయన ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? చిత్రం లో నుండి మరొక పాటని చూడం ఇదేరా ''స్నేహం… ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం…'' అంటూ సాగే ఈ పాట స్నేహం యొక్క గొప్పతనాన్ని వివరించారు.

ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం…

ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం…


కనీవినీ ఎరగని స్నేహం… ఇది కాలం చూడని స్నేహం.

దేహం అడగని స్నేహం… ఇది హృదయం అడిగే స్నేహం.


నింగినీ.. నేలనీ.. వానచినుకులై కలిపేను స్నేహం…

తూర్పుకీ పడమరకీ… కాంతి తోరణం అయ్యిందీ స్నేహం..


ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం…

ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం… ||2||


కనీవినీ ఎరగని స్నేహం… ఇది కాలం చూడని స్నేహం.

దేహం అడగని స్నేహం… ఇది హృదయం అడిగే స్నేహం.


హో.. నీ ఉంటానంటూ.. బతిమాలింది చిరుగాలి..

నీ పాదం తాకాలంటూ… అలలైంది ఆ కడలి.


తన మచ్చను నీ స్వచ్చతతో.. కడగాలంది జాబిలి.

నీ భరణం మోసేటందుకే… పుట్టానంది ఈ పుడమే…


ఆశలు ఆకర్షణలు లేనిది… నీ ఆడ మగ స్నేహం..

నీతోనే ఇంకో నువ్వే… చేసే స్నేహమే మీ ఇద్దరి స్నేహం.


ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం…

ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం…


ఓ… తన చూపులు నువ్వు చూస్తుంటే…

నీ కళలను తాను కంటోంది..


తను మాటలు నువ్వుంటుంటే…

నీ నవ్వులు తను నవ్వింది.


తాను అడుగులు వేస్తూ ఉంటే..

గమ్యం నువ్వే చేరేవు..


నీలో నువ్వు చేయని పనులే..

నీలా తానే చేసేను..


జన్మలే చాలక మళ్ళీ మళ్ళీ… జన్మించే స్నేహం..

దేవుడే ప్రేక్షకుడై చూసి చూసి… మురిసే మీ స్నేహం.


ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం…

ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం… ||2||


సినిమా: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?

దర్శకుడు: మున్న

గానం: అర్మాన్ మాలిక్

సంగీతం: అనూప్ రూబెన్స్

సాహిత్యం: చంద్రబోస్



Show Full Article
Print Article
More On
Next Story
More Stories