OTT Movie: దృశ్యం కంటే కూడా షాకింగ్ ట్విస్టులు.. క్లైమాక్స్ ఊహించలేరు!

OTT Movie: దృశ్యం కంటే కూడా షాకింగ్ ట్విస్టులు.. క్లైమాక్స్ ఊహించలేరు!
x

OTT Movie: దృశ్యం కంటే కూడా షాకింగ్ ట్విస్టులు.. క్లైమాక్స్ ఊహించలేరు!

Highlights

ప్రస్తుతం ఓటీటీలో కొత్త కాన్సెప్ట్‌ సినిమాలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అదే తరహాలో క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఐడెంటిటీ సినిమా దృశ్యం మూవీని గుర్తు చేసేంత సస్పెన్స్‌, ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

ప్రస్తుతం ఓటీటీలో కొత్త కాన్సెప్ట్‌ సినిమాలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అదే తరహాలో క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఐడెంటిటీ సినిమా దృశ్యం మూవీని గుర్తు చేసేంత సస్పెన్స్‌, ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. 2025లో థియేటర్లలో విడుదలై మంచి హిట్‌ సాధించిన ఈ మలయాళీ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది.

సాధారణంగా మొదలైన కథ క్రమంగా మానసిక ఉత్కంఠకు గురిచేస్తూ అర్థంకాని ట్విస్టులతో ముందుకు సాగుతుంది. ఒక పోలీస్ అధికారి, స్కెచ్ ఆర్టిస్ట్ జంట కలిసి ఒక సంక్లిష్ట హత్య కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తారు. కానీ కేసు లోతుగా వెళ్లే కొద్దీ వారికి కొత్త రహస్యాలు బహిర్గతం అవుతాయి. సినిమా మొదటి 15 నిమిషాల్లోనే తర్వాతి సన్నివేశాలపై ఉత్సుకత పెంచేలా సస్పెన్స్ రైడ్‌ను సృష్టించారు. ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం పూర్తిగా ఊహించలేనిది.

ఐడెంటిటీ సినిమాకు 7.3 IMDb రేటింగ్ రావడం విశేషం. 2 గంటల 37 నిమిషాల నిడివితో రూపొందిన ఈ థ్రిల్లర్ ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. అనాస్ ఖాన్, అఖిల్ పాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్, టోవినో థామస్, గోపికా రమేష్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఇది పూర్తిగా సస్పెన్స్‌, మిస్టరీ, యాక్షన్‌ల మేళవింపుతో కూడిన సినిమాటిక్ రోలర్‌కోస్టర్‌. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి తప్పక చూడదగ్గ సినిమా ఇది.

Show Full Article
Print Article
Next Story
More Stories