Naga Shaurya: స్టార్ హీరో అవ్వాలంటే ఇదే మార్గం అంటున్న నాగశౌర్య

* ఇంకొక మూడు సినిమాలతో స్టార్ హీరో అయిపోవచ్చు అంటున్న నాగశౌర్య

admin1
Published on: 31 Oct 2021 12:37 PM IST
I will become a Star Hero in the Industry After three Block Busters says Naga Shaurya
X

నాగ శౌర్య (ఫైల్ ఫోటో)

Naga Shaurya: యువ హీరో నాగ శౌర్య ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరో ఇమేజ్ ఇలానే వస్తుంది అంటూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నాలుగైదు బ్లాక్బస్టర్ సినిమాలు ఉంటే ఎవరైనా స్టార్ హీరో అయిపోతారు అంటున్నాడు నాగశౌర్య.

ఇప్పటికే "ఛలో" సినిమాతో తన కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్బస్టర్ సినిమా అని చెప్పిన నాగ శౌర్య ఇప్పుడు తన "వరుడు కావలెను" సినిమాతో మరో బ్లాక్బస్టర్ ని అందుకోబోతున్నట్లుగా తెలిపారు. ఇక ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ లు వచ్చాయని, ఇంకా మూడు మాత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు నాగశౌర్య.

ఆ మూడు బ్లాక్ బస్టర్ లు కూడా వస్తే తాను కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిపోతాను అని చెబుతున్నారు నాగశౌర్య. "అశ్వత్థామ" సినిమా గురించి మాట్లాడుతూ "నర్తనశాల" సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ లభించాయని అందుకే ఆ సినిమాను ఫ్లాప్ గా పరిగణించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు నాగశౌర్య.

నాగ శౌర్య, రీతు వర్మ హీరో హీరోయిన్ గా నటించిన "వరుడు కావలెను" సినిమా ఈమధ్యనే విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచే ఆ ప్రాజెక్టుపై తనకి నమ్మకం ఉందని ఇక ఫైనల్ ఎడిట్ చూశాక ఈ సినిమా బ్లాక్బస్టర్ అవుతుందని నమ్మకం కుదిరిందని నాగ శౌర్య అన్నారు.

admin1

admin1

Next Story