హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ CV ఆనంద్ గారి చేతుల మీదుగా ఆశ్లి క్రియేషన్స్ "మిస్స్టీరియస్" సినిమాలోని "అడుగు అడుగునా " అనే పాట ని విడుదల చేయడమైనది.

Hyderabad Police Commissioner CV Anand Launches Adugu Aduguna Song
x

Hyderabad Police Commissioner CV Anand Launches Adugu Aduguna Song

Highlights

ఈ రోజు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ CV ఆనంద్ గారి చేతుల మీదుగా ఆశ్లి క్రియేషన్స్ "మిస్స్టీరియస్" సినిమాలోని "అడుగు అడుగునా " అనే పాట ని విడుదల చేయడమైనది.

ఈ రోజు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ CV ఆనంద్ గారి చేతుల మీదుగా ఆశ్లి క్రియేషన్స్ "మిస్స్టీరియస్" సినిమాలోని "అడుగు అడుగునా " అనే పాట ని విడుదల చేయడమైనది. ఈ పాట అంకితభావంతో పనిచేసే పోలీసు అధికారిపై చిత్రీకరించబడింది. ఈ పాటని చుసిన కమీషనర్ CV ఆనంద్ గారు పాట పాడిన MLR కార్తీకేయన్ ని మెచ్చుకుంటూ పాటని అద్భుతంగా చిత్రకరించారని కొనియాడారు.పోలీస్ యొక్క నిబద్ధతని అద్భుతంగా రాసి మరియు పాట కి సంగీత దర్శకత్వం వహించిన ML రాజా ని అభినందించారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని కొత్త వరవడి లో చూపించే ప్రయత్నం చేసిన దర్శకులు మహీ కోమటిరెడ్డి ని, మరియు అమెరికాలో స్థిరపడి కూడా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ సినిమాని నిర్మించిన జయ్ వల్లందాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని చెప్పారు. ఈ కార్యక్రమం లో హీరో రోహిత్ సాహిని, గౌతమ్, దర్శకులు మహి కోమటిరెడ్డి, నిర్మాత జయ్ వల్లందాస్, సహా నిర్మాత రామ్ ఉప్పు (బన్నీ రామ్) మరియు ఇతరులు పాల్గొన్నారు.

ఎంతో బిజీ గా ఉండి కూడా మా సినిమా లిరికల్ సాంగ్ ని విడుదల చేసినందుకు కమీషనర్ CV ఆనంద్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నామని నిర్మాత జయ్ వల్లందాస్ మరియు దర్శకులు మహి కోమటిరెడ్డి చెప్పారు. ఈ లిరికల్ పాట వీడియో ఈ రోజు నుండి మా ఆశ్లీ మ్యూజిక్ ఛానెల్ లో అందుబాటులో ఉంటుంది. దయచేసి అందరూ చూసి మమ్మల్ని ప్రోత్సహించవలిసిందిగా కోరుతున్నాము అని ఈ చిత్ర నిర్మాత జయ్ వల్లందాస్ అన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories