Actress: నేషనల్ అవార్డ్‌ మూవీని మిస్‌ చేస్తున్న హుషారు బ్యూటీ.. ఇంతకీ ఏంటా సినిమా.?

Actress: నేషనల్ అవార్డ్‌ మూవీని మిస్‌ చేస్తున్న హుషారు బ్యూటీ.. ఇంతకీ ఏంటా సినిమా.?
x

Actress: నేషనల్ అవార్డ్‌ మూవీని మిస్‌ చేస్తున్న హుషారు బ్యూటీ.. ఇంతకీ ఏంటా సినిమా.?

Highlights

సుహాస్‌ హీరోగా, చాందిని హీరోయిన్‌గా తెరకెక్కిన కలర్‌ ఫోటో మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్లపై సాయి రాజేష్, బెన్నీ ముప్పానేని నిర్మించగా, సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు.

సుహాస్‌ హీరోగా, చాందిని హీరోయిన్‌గా తెరకెక్కిన కలర్‌ ఫోటో మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్లపై సాయి రాజేష్, బెన్నీ ముప్పానేని నిర్మించగా, సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. సుహాస్‌, చాందీనీల అద్భుత నటన, పాటలు ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది.

1990లో మచిలిపట్నం నేపథ్యంలో రూపొందిన ఈ కథలో సునీల్, వైవా హర్ష, ‘కంచరపాలెం’ ఫేమ్ సుబ్బారావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. విఫల ప్రేమ కథను ఇతివృత్తంగా తెరకెక్కించి ఈ సినిమా ఏకంగా నేషనల్ అవార్డును అందుకోవడం విశేషం. చిన్న సినిమాగా వచ్చిన కలర్‌ ఫోటో మంచి సినిమాగా నిలిచింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట తనకు అవకాశం వచ్చిందని చెప్పారు హుషారు ఫేమ్‌ ప్రియా వడ్లమాని.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆ విషయాన్ని పంచుకున్నారు. ప్రేమకు రెయిన్ చెక్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన ప్రియా.. శుభలేఖలు, హుషారు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హుషారు విజయంతో మంచి గుర్తింపు పొందినా, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియా మాట్లాడుతూ, ఫేస్‌బుక్‌లో తన ఫోటోలు చూసి సినిమా అవకాశం వచ్చిందని, 2015లో తన సినీ ప్రయాణం ప్రారంభమైందని చెప్పింది.

కెరీర్‌ ప్రారంభంలోనే కలర్ ఫోటో ఆఫర్ వచ్చినప్పటికీ, ఆ సమయంలో సరైన మార్గదర్శకులు లేకపోవడంతో సినిమాను మిస్ చేసుకున్నట్లు వెల్లడించింది. తాను సినిమా పరిశ్రమ నేపథ్యంతో వచ్చిన వ్యక్తి కాకపోవడం, కుటుంబ సభ్యుల అనుమతి అవసరమైన పరిస్థితి కారణంగా ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. అలాగే, గ్రామీణ యువతి పాత్రకు తాను సరిపోను అన్న అభిప్రాయం వల్ల కూడా ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories