War2: వార్2 విడుదల ఎప్పుడంటే..!

Hrithik Roshan and Ntr War 2 Latest Update
x

వార్2 విడుదల ఎప్పుడంటే..!

Highlights

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వార్2. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

War2: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వార్2. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా రైటర్ అబ్బాస్ వార్2కి సంబంధించి ఓ అప్ డేట్ ఇచ్చారు.

వార్2 షూటింగ్ దాదాపు పూర్తయింది. ఆగస్టు 25న విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ రోజు హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లను థియేటర్‌లో కలుద్దాం. వార్2లో డైలాగులన్నీ తానే రాశానని.. అందరికి నచ్చేలా ఉంటాయన్నారు. షారూఖ్‌ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్‌ల కాంబోలో ఓ సినిమా ప్రారంభంకానుంది. పఠాన్2 కూడా సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాలకు కూడా తానే రచయితగా వర్క్ చేస్తున్నానని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్బాస్ తెలిపారు.

వార్‌2 మూవీతోనే ఎన్టీఆర్ మొదటి సారి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన మొదటి సినిమా కావడంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. హృతిక్, తారక్ ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. వీరిద్దరి కలయికలో ఓ స్పెషల్ సాంగ్‌ కూడా చేశారని టాక్. మరి వీరి కలయికలో వచ్చే పాట ఎలా ఉంటుందా అని చూడ్డానికి ఆడియన్స్ చాలా ఎగ్జయింట్‌గా ఫీలవుతున్నారు. వార్2 ఆగస్టు 25న విడులయ్యే అవకాశం ఉందని అబ్బాస్ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం వార్. ఈ స్పై థ్రిల్లర్ సూపర్ హిట్ కావడంతో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. సినిమాపై అంచనాలు ఉండడంతో దీనికి సీక్వెల్‌గా వార్2 తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా నటించనున్నట్టు తెలుస్తోంది. గతంలో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారూఖ్ ఖాన్‌లు ఏజెంట్‌ పాత్రల్లో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. వీటన్నింటి కంటే భిన్నంగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత వస్తున్న సినిమా వార్2. దీంతో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాత తారక్.. ప్రశాంత్ నీల్ చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నారు.

మహారాష్ట్ర కోల్‌కత్తా బ్యాక్ డ్రాప్‌లలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కి జోడిగా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్‌ నటించనున్నారు. దాదాపు రూ.400 కోట్లతో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories