Honeymoon in Shillong: సంచలనం సృష్టించిన హనీమూన్‌ హత్య.. రాజా రఘువంశీ కేసు ఆధారంగా సినిమా

Honeymoon in Shillong
x

Honeymoon in Shillong: సంచలనం సృష్టించిన హనీమూన్‌ హత్య.. రాజా రఘువంశీ కేసు ఆధారంగా సినిమా

Highlights

Honeymoon in Shillong: నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. అందులోనూ షాకింగ్ అనిపించే సంఘటనలు జరిగితే వాటిని సినిమాగా తీయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

Honeymoon in Shillong: నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. అందులోనూ షాకింగ్ అనిపించే సంఘటనలు జరిగితే వాటిని సినిమాగా తీయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇటీవల మేఘాలయలోని షిల్లాంగ్ లో హనీమూన్‌కు వెళ్ళిన దంపతులలో భర్త రాజా రఘువంశీ హత్యకు గురయ్యారు. ఈ హత్య చేసింది అతని భార్య సోనమ్ రఘువంశీ అని తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ షాకింగ్ ఘటన సినిమాగా మారుతోంది.

బాలీవుడ్‌లో ఎస్.పి. నింబావత్ హనీమూన్ ఇన్ షిల్లాంగ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాజా రఘువంశీ హత్య కేసు చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ పూర్తయింది. ఈ సినిమా షూటింగ్‌లో 80 శాతం ఇండోర్‌లో జరుగుతుంది. మిగిలిన 20 శాతం షూటింగ్ మేఘాలయలోని వివిధ ప్రదేశాలలో చేయనున్నారు. ప్రస్తుతానికి, దర్శకుడు సినిమా నటీనటుల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

రాజా రఘువంశీ సోదరుడు సచిన్ రఘువంశీ ఈ సినిమా చేయడానికి పూర్తి మద్దతు ఇచ్చారు. "నా సోదరుడి హత్య కేసు పెద్ద తెరపైకి రాకపోతే, ఎవరు సరైన వారు, ఎవరు తప్పు చేశారన్న విషయం ప్రజలకు తెలియదు. ఈ హత్య వెనుక ఉన్న సంఘటనలను సినిమా వెలుగులోకి తెస్తుందని నేను నమ్ముతున్నాను" అని సచిన్ అన్నారు.

"రాజా రఘువంశీ పెళ్లి, పెళ్లికి ముందు అతని భార్య వేసిన ప్లాన్.. ఇవన్నీ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ చిత్రం కేవలం థ్రిల్‌ను మాత్రమే కాకుండా, ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తుంది" అని వారు చెప్పారు.

రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీలు వివాహం చేసుకున్నారు. రాజా ఇండోర్‌లో ఒక వ్యాపారవేత్త. హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్ళిన సమయంలో, సోనమ్ తన భర్తను హత్య చేసింది. ఈ హత్యలో ఆమె ప్రేమికుడు రాజ్ కుష్వాహా, మరో ముగ్గురు కూడా పాలుపంచుకున్నారు. ప్రస్తుతం వీరందరూ జైలులో ఉన్నారు. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories