Rajamouli: రాజమౌళి సినిమాలపై కన్నేసిన హాలీవుడ్ నిర్మాణ సంస్థలు

Hollywood Production Houses Eyeing Rajamouli
x

Rajamouli: రాజమౌళి సినిమాలపై కన్నేసిన హాలీవుడ్ నిర్మాణ సంస్థలు

Highlights

Rajamouli: రాజమౌళితో సినిమా కోసం ముందుకొస్తున్న హాలీవుడ్ నిర్మాతలు

Rajamouli: బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్ కి ఎదిగారు. తాజాగా ఇప్పుడు "ఆర్ఆర్ఆర్" సినిమాతో ఆస్కార్ బరిలో కూడా దిగారు. "ఆర్ ఆర్ ఆర్" సినిమా ఆస్కార్ నామినేషన్ కోసం రాజమౌళి ఎంత ప్రయత్నించారో అందరికీ తెలిసిందే. ఆస్కార్ వచ్చినా రాకపోయినా "ఆర్ఆర్ఆర్" సినిమాకి హాలీవుడ్ నుంచి సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకి ప్రశంసలు కురిశాయి. అంతర్జాతీయ మీడియాలో కూడా రాజమౌళి పేరు మారుమ్రోగింది.

హాలీవుడ్ మీడియా సైతం రాజమౌళి గురించి కథనాలు రాసింది. దీంతో హాలీవుడ్ లోని నటీనటులు, డైరెక్టర్లతో పాటు ఇతర టెక్నీషియన్లకు కూడా రాజమౌళి పేరు ఇప్పుడు బాగా పరిచయమైంది అని చెప్పవచ్చు. ఇప్పుడు అదే జక్కన్న కి బాగా కలిసి వచ్చింది. హాలీవుడ్ కి చెందిన కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు రాజమౌళితో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. భారతీయ భాష అయినా పర్లేదు ఇంగ్లీష్ అయినా పర్లేదు కానీ రాజమౌళితో సినిమా నిర్మించేందుకు ఈ నిర్మాణ సంస్థలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయట.

తాజాగా ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఒక హాలీవుడ్ నిర్మాణ సంస్థ వ్యవహరించబోతున్నట్లుగా సమాచారం. హాలీవుడ్ నిర్మాణ సంస్థ భాగస్వామ్యం అంటే డాలర్ల రూపంలో కాబట్టి బడ్జెట్ భారీగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అప్పుడు సినిమా రేంజ్ కూడా ఇంకా పెరుగుతుంది. ఏదేమైనా రాజమౌళి మాత్రం టాలీవుడ్ కి గర్వకారణంగా నిలుస్తున్నారు అని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories