కోరోనాతో పోరాడి మృతి చెందిన హాలీవుడ్ నటుడు

కోరోనాతో పోరాడి మృతి చెందిన హాలీవుడ్ నటుడు
x
Mark Blum (File Photo)
Highlights

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచానికి వెల్లడిస్తుంది.. రోజురోజుకు విజృంభిస్తూ కొన్ని వేల మందిని బలి తీసుకుంటుంది.

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచానికి వెల్లడిస్తుంది.. రోజురోజుకు విజృంభిస్తూ కొన్ని వేల మందిని బలి తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ హాలీవుడ్ కి చిత్ర పరిశ్రమకి కూడా ఈ వైరస్ సోకింది. తాజాగా ఓ హీరోయిన్ తండ్రి కరోనా వల్ల చనిపోయాడు. ఇప్పుడు తాజాగా హాలీవుడ్ నటుడు మార్క్ బ్లమ్ కరుణ తో పోరాడుతూ మృతి చెందాడు. గత రెండు వారాలుగా కరోనా వైరస్‌తో బాధపడుతూ తుది శ్వాస విడిచాడు. 69 ఏళ్ల మార్క్ హాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించడంతో పాటు ఈ మధ్య వెబ్ సిరీస్‌లలో కూడా నటించి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మార్క్ బ్లమ్ మృతి పట్ల అయన భార్య జానెట్ జరీస్ తో పాటు ఆయన అభిమానుల దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా విలయ తాండవం ఆడుతుంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు 195 దేశాలకు పైగా వ్యాపించి 20 వేల మంది మరణాలకు కారణమైంది. అయిదు లక్షల మంది ఈ వైరస్ బారినా పడ్డారు. ఇక భారతదేశంలో ఇప్పటికే 20 మంది మృతి చెందగా, 900కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా భారత ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories