అర్జున్ రెడ్డిని మించిపోయిన 'మలంగ్'

అర్జున్ రెడ్డిని మించిపోయిన మలంగ్
x
Highlights

ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ జంటగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'మలంగ్'.

ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ జంటగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'మలంగ్'. అయితే తాజాగా విడుదలైనా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్లు విడుదలైయ్యాయి. అయితే దిత్య రాయ్ కపూర్, దిశా పటానీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో హీట్ పెంచుతుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో దిశ, ఆదిత్య భుజాలపై అతనికి ఘాటుగా కిస్ ఇస్తున్నట్లు కలిపించారు. ఈ పోస్టర్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది. పొస్టరే ఈ రేంజ్ లో ఉంటే ఈ సినిమాలో సిన్స్ ఎలా ఉంటాయో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈ నెల 6న విడుదలకానుంది. ఇక ఫిబ్రవరి 7న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి జగన్నాద్ దర్శకతంలో వచ్చిన లోఫర్ సినిమాతో దిశా పటానీ టాలీవుడ్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే లోఫర్ సినిమా ఫలితాలు భిన్నంగా రావడంతో ఈ అమ్మడికి తెలుగులో ఆఫర్లు రాలేదు. అయితే బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది. బాగీ2, భారత్ చిత్రాల్లో నటించింది. తాజాగా ఆదిత్యరాయ్ కపూర్, 'మలంగ్' నటిస్తుంది. ఈ చిత్రంలో సముద్రం ఒడ్డున ఆదిత్య, దిశ చుంబన ఫోస్టర్ నెటింట్లో హల్‌చల్ చేస్తుంది. ఈ పోస్టర్‌ను దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అయితే దిశ టైగర్ ష్రాఫ్‌తో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ లో ప్రచారంలో జరుగుతుంది. దిశ పోస్ట్ చేసే ఫొటోలకు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌ తల్లి ఆయేషా లైక్స్ కొట్టేస్తుంటారు.

ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దిశ ఆదిత్య ప్రేమికులుగా నటిస్తున్నారు. మలంగ్ లో అనిల్ కపూర్ పోలీసుగా విలన్ గా కనిపింబోతున్నారు. 'ఆషికి 2', 'ఏక్ విలన్' సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మోహిత్ సూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. జనవరి 6న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ కోసం నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories