పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరంతేజ్ సినిమాలో హీరోయిన్లు ఎవరో తెలుసా?!

Heroines Ready For Pawan Kalyan Remix Movies
x

పవన్ కళ్యాణ్ రీమిక్స్ సినిమాల కోసం రెడీ అయిన హాట్ హీరోయిన్లు

Highlights

* పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరంతేజ్ సినిమాలో హీరోయిన్లు ఎవరో తెలుసా?!

Pawan Kalyan: "వకీల్ సాబ్" మరియు "భీమ్లా నాయక్" వంటి రీమేక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ఇప్పుడు రీమేక్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళ్లో సూపర్ హిట్ అయిన "వినోదయ సితం" అనే సినిమాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం "రొమాంటిక్" బ్యూటీ కేతిక శర్మ మరియు వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరంతేజ్ లా సరసన ఈ ఇద్దరు హీరోయిన్లు ఎంతవరకు సెట్ అవుతారో వేచి చూడాలి. ఇక ఈ సినిమాలోని నటీనటుల గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చాలాకాలం తర్వాత కామెడీ కింగ్ బ్రహ్మానందం మళ్లీ ఈ సినిమాతో వెండితెరపై కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్రహ్మానందం కి దాదాపు ఫుల్ లెన్త్ పాత్ర ఇచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్ నటి రోహిణి, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్రివిక్రమ్ కి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. తమిళ్లో ఈ సినిమాకి దర్శకత్వం వహించిన నటుడు మరియు డైరెక్టర్ సముద్రఖని తెలుగు వర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories