కోటి రూపాయల ఆఫర్ ని వదులుకున్న హైబ్రిడ్ పిల్ల

sai pallavi
x
sai pallavi
Highlights

చేసినవి కొన్ని సినిమాలు అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ..

ఒక్క సినిమా హిట్టు అయితే చాలు హీరోకి అయిన, హీరోయిన్ కి అయిన యాడ్స్ ఆఫర్స్ చాలా వస్తాయి. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టి ఒకే చెబుతూ యాడ్స్ లో కనిపిస్తూ ఉంటారు. కానీ సాయి పల్లవి మాత్రం కథల ఎంపీకలో మాత్రమే కాదు. యాడ్స్ ఎంపీకలో కూడా చాలా జాగ్రత్త వ్యవహరిస్తుంది ఈ హైబ్రిడ్ పిల్ల...

చేసినవి కొన్ని సినిమాలు అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగు నేర్చుకొని తన పాత్రలకి తానే డబ్బింగ్ చెబుతుంది. దీనితో సాయి పల్లవికి హీరోయిన్ గా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో సాయి పల్లవికి ఓ పెద్ద వస్త్ర కంపెనీకి ఏడాది పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని ఆఫర్ వచ్చిందట. దీనికి గాను అక్షరాల కోటి రూపాయల రెమ్యునరేషన్ కూడా ఇస్తామని అన్నారట.. కానీ ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించిదని ఫిలిం నగర్ లో వార్త హాల్ చల్ చేస్తుంది.

తనకి మనసుకు నచ్చిన ఏ చిన్నపని అయిన చేస్తానని కానీ నచ్చనిది చేయనని మరోసారి ప్రూవ్ చేసింది సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె విరాటపర్వం, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories