Katrina Kaif: పిల్లల కోసం గుళ్ల చుట్టూ తిరుగుతున్న స్టార్ హీరోయిన్

Katrina Kaif: పిల్లల కోసం గుళ్ల చుట్టూ తిరుగుతున్న స్టార్ హీరోయిన్
x
Highlights

Katrina Kaif: టాలీవుడ్ లో మల్లీశ్వరీగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ గురించి ప్రత్యేకించీ చెప్పక్కర్లేదు. మల్లీశ్వరీ మూవీతో తెలుగు...

Katrina Kaif: టాలీవుడ్ లో మల్లీశ్వరీగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ గురించి ప్రత్యేకించీ చెప్పక్కర్లేదు. మల్లీశ్వరీ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. భాషతో సంబంధం లేకుండా బాలీవుడ్ తోపాటు తెలుగు, మలయాళంలో కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది. అత్యంత పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్ ను 2021లో పెళ్లి చేసుకుంది. వయసులో తనకంటే చిన్నవాడైన విక్కీ కౌశల్ తో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది.

అయితే ఈ మధ్య కాలంలో కత్రీనా దేవాలయాలు, పూజలు అంటూ చాలా బిజీగా ఉంటోంది. మొన్న కుంభమేళాలో పుణ్య స్నానాలు చేసిన ఈ బ్యూటీ..ఇప్పుడు కర్నాటకలోని ప్రసిద్ధిదేవాలయం కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయంలో కుటుంబంతో సహా దర్శనమిచ్చింది. కత్రీనా అక్కడ సర్ప సంస్కార పూజలో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సంతానం కోసం పూజలు, పుణ్యస్నానాలు చేస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఎందుకంటే కుక్కే సుబ్రమణ్యస్వామిని దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని చాలామంది బలంగా నమ్ముతుంటారు. ఇప్పుడు కత్రినా కూడా ఈ దేవాలయాన్ని సందర్శించడం, ప్రత్యేక పూజలు చేయడం చూసి పిల్లలకోసమే కావచ్చు అంటున్నారు నెటిజన్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories