ప్రముఖ హీరో దర్శకత్వంలో నటించనున్న విశ్వక్ సేన్

Hero Vishwak Sen under the direction of Arjun Sarja | Tollywood News
x

ప్రముఖ హీరో దర్శకత్వంలో నటించనున్న విశ్వక్ సేన్

Highlights

*ప్రముఖ హీరో దర్శకత్వంలో నటించనున్న విశ్వక్ సేన్

Vishwak Sen: ఈమధ్య ఇండస్ట్రీలో యువహీరో విశ్వక్ సేన్ పేరు బాగానే వినిపిస్తోంది. ఈమధ్యనే అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు విశ్వక్. ఈ నేపథ్యంలో విశ్వక్ తదుపరి సినిమాలపై బాగానే అంచనాలు నెలకొంటున్నాయి. తాజాగా ఒకప్పటి స్టార్ హీరో దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నట్లు గా వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రముఖ కోలీవుడ్ నటుడు అర్జున్ సర్జా తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితుడే. తెలుగులో కూడా చాలా హిట్లు అందుకున్న అర్జున్ ఇప్పుడు దర్శకుడిగా మారబోతున్నారట. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశ్వక్ సేన్ ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం కాబోతోంది అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెల ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయట. మరోవైపు విశ్వక్ సేన్ మిథిలా పాల్కర్ హీరోయిన్ గా "ఓరి దేవుడా" అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories