Vishal: లంచం తీసుకున్నరు.. సెంట్రల్ సెన్సార్ బోర్డుపై విశాల్ సంచలన ఆరోపణలు

Hero Vishal Sensational Comments on Movie Censor Board
x

Vishal: లంచం తీసుకున్నరు.. సెంట్రల్ సెన్సార్ బోర్డుపై విశాల్ సంచలన ఆరోపణలు

Highlights

Vishal: మార్క్ ఆంటోని హిందీ వెర్షన్ కోసం.. రూ.6.50 లక్షలు తీసుకున్నారంటూ వీడియో రిలీజ్

Vishal: సెంట్రల్ సెన్సార్ బోర్డుపై తమిళ హీరో విశాల్ సంచలన ఆరోపణలు చేశారు. ముంబైలో సెన్సార్ బోర్డు సభ్యులు లంచం తీసుకున్నారని ఆరోపించారు. తాను నటించిన మార్క్ ఆంటోని హిందీ వెర్షన్ కోసం 6 లక్షల 50వేల రూపాయల లంచం తీసుకున్నారంటూ Xలో వీడియో రిలీజ్ చేశారు విశాల్. డబ్బులు పంపిన అకౌంట్ డీటేల్స్ తో సహా పోస్ట్ చేశారు. ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సినిమాల్లో అవినీతిని చూడటం ఓకే కానీ నిజ జీవితంలో జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు విశాల్. ప్రభుత్వ కార్యాలయాల్లో మరీ ముఖ్యంగా ముంబైలోని CBFC ఆఫీసులో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తన సినిమా మార్క్ ఆంటోని హిందీ వెర్షన్ స్క్రీనింగ్ కోసం 3లక్షలు, సర్టిఫికెట్ కోసం మూడున్నర లక్షలు ఇచ్చానని చెప్పారు. మరో దారి లేక డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్‌లో ఏ నిర్మాతకు ఇలా జరగకూడదని.. న్యాయమే గెలుస్తుందని Xలో పోస్ట్ చేశారు విశాల్.


Show Full Article
Print Article
Next Story
More Stories