చంటి టు వెంకీమామ .. వెంకీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

చంటి టు వెంకీమామ .. వెంకీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్
x
venkatesh
Highlights

టాలీవుడ్ లో ఒక్క హిట్టు ప్లాప్ అనేది ఓ హీరో రేంజ్, రెమ్యునరేషన్ ని డిసైడ్ చేస్తుంది. అలాంటిది ఏకంగా విక్టరీనే తన ఇంటి పేరుగా

టాలీవుడ్ లో ఒక్క హిట్టు ప్లాప్ అనేది ఓ హీరో రేంజ్, రెమ్యునరేషన్ ని డిసైడ్ చేస్తుంది. అలాంటిది ఏకంగా విక్టరీనే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు హీరో వెంకటేష్.. మొదటి సినిమా కలియుగ పాండవుల నుంచి నిన్న వచ్చిన వెంకీమామ వరకు అన్ని రకాల ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాడు ఈ హీరో .. ఇప్పటివరకు వెంకటేష్ నటించిన కొన్ని సినిమాల కలెక్షన్స్ రిపోర్ట్స్ గురించి ఒక్కసారి చర్చించుకుందాం..

చంటి

వెంకటేష్ కెరియర్ కి పెద్ద టర్నింగ్ పాయింట్ ఈ సినిమానే. తమిళ్ లో మంచి హిట్టు అయిన చినతంబి సినిమాని ఇక్కడ చంటి అనే పేరుతో రీమేక్ చేశారు. మీనా, వెంకటేష్ కలిసి నటించిన ఈ సినిమాకి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమా 9 కోట్లను సాధించిపెట్టింది. 39 సెంటర్లలో ఈ సినిమా 100 రోజులను పూర్తి చేసుకుంది.

నువ్వు నాకు నచ్చావ్

వెంకటేష్ లోని పుల్ కామెడీ యాంగిల్ ని బయటపెట్టిన సినిమా ఇదే.. విజయ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ 3కోట్లు బడ్జెట్ తో తెరకేక్కించింది. ఈ సినిమా 12కోట్లు కలెక్షన్స్ ని సాధించింది..ఇప్పటికి ఈ సినిమాని టీవీలో వస్తే వదలకుండా చూసే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

రాజా

చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అప్పట్లో 7కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా 71 ధియేటర్ లలో 100 రోజులు ఆడింది. నాలుగు ధియేటర్ లలో 175 రోజులు ఆడింది. ఈ సినిమాతోనే వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు.

సూర్యవంశం

అప్పటివరకు లవ్ స్టొరీస్, కామెడి చిత్రాలతో నటుడిగా ప్రూవ్ చేసుకున్న వెంకటేష్ కి ఈ సినిమాతో సెంటిమెంట్ ని అద్బుతంగా పండించగలడు అని నిరూపించాడు. ఈ సినిమా 11 కోట్ల షేర్ ని సాధించింది.

కలిసుందాం రా

పక్కా ఫ్యామిలీ కథతో వచ్చిన ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లో మరో మైలురాయిగా నిలిచింది. 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 16 కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమాకి గాను వెంకటేష్ కి బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు అందుకున్నాడు. ఈ సినిమా 76 సెంటర్లలో 100 రోజులు ఆడింది.

ప్రేమించుకుందాం రా

అప్పట్లో ఈ సినిమా పెద్ద హిట్టు.. వెంకటేష్, అంజలా జవేరి హీరోయిన్ గా లవ్ స్టొరీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించారు, ఈ సినిమా 57 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

చాలా రోజుల తరవాత సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ మూవీస్ ఈ సినిమాతోనే మొదలయ్యాయి. మంచి కుటుంబ కథతో తెరకెక్కిన ఈ సినిమా 55 కోట్ల షేర్స్ ని రాబట్టింది.

f2

వినోద భరితంగా తెరకెక్కిన ఈ సినిమా 127 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది.

వెంకీమామ

నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు 16 కోట్ల గ్రాస్ ని వసూళ్ళు చేసింది. ఈ సినిమాని 34 కోట్లతో తెరకెక్కించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories