Suriya : నా కోసం జో ఎన్నో వదులుకుంది..ఈ కారణంతోనే ముంబైకి షిఫ్ట్ అయ్యాం

Suriya : నా కోసం జో ఎన్నో వదులుకుంది..ఈ కారణంతోనే ముంబైకి షిఫ్ట్ అయ్యాం
x
Highlights

Suriya : తన కుటుంబంతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయిన విషయం గురించి స్టార్ హీరో సూర్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ముంబైకి తాను షిఫ్ట్ అవ్వడం వల్ల...

Suriya : తన కుటుంబంతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయిన విషయం గురించి స్టార్ హీరో సూర్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ముంబైకి తాను షిఫ్ట్ అవ్వడం వల్ల ఊహించని మార్పులు వచ్చినట్లు చెప్పారు. అంతేకాదు ఫ్యామిలీ కోసం తన భార్య జ్యోతిక ఎన్నో వదులుకుందంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. కంగువా మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య ఈ విషయాలు చెప్పుకొచ్చారు.

సూర్య మాట్లాడుతూ..తనకు 18ఏళ్లు ఉన్నప్పుడే జ్యోతిక చెన్నైకి వచ్చింది. మా పెళ్లి తర్వాత కూడా మేము అక్కడే ఉన్నాము. ఆమె నాకోసం మా కుటుంబం కోసం ఎన్నో వదులుకుంది. ముంబైలోని తన స్నేహితులతోపాటు కేరీర్ ను కూడా వదులుకుంది. ఈ క్రమంలోనే తన లైఫ్ స్టైల్ ను కూడా మార్చుకుందని సూర్య చెప్పారు.

కోవిడ్ తర్వాత ఆ మార్పు అవసరం అనిపించింది. అందుకే మేము ముంబైకి షిఫ్ట్ అయ్యాము. ఇప్పుడు ఆమెకు ఎన్నో కొత్త ఛాన్సులు వస్తున్నాయి. డిఫరెంట్ ప్రాజెక్టుల్లోనూ పనిచేస్తోంది. వైవిధ్యమైన సినిమాల్లోనూ నటిస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పుడు జ్యోతిక ఫ్యామిలితోపాటు స్నేహితులతో కలిసి గడుపుతుంది.

ప్రొఫెషనల్ గానూ ఎంతో బిజీగా మారింది. తాను ముంబైలో ఉంటే పనిని పూర్తిగా పక్కన పెట్టేస్తానని..నెలలో పది రోజులు ఫ్యామిలీ కోసం కేటాయిస్తానని సూర్య చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories