Siddharth: ఎయిర్‌పోర్టులో 20 నిమిషాల పాటు హెరాస్ చేశారు.. ఆవేదన వ్యక్తం చేసిన సిద్ధార్థ్

Hero Siddharth Said That He Was Harassed at Madurai Airport
x

Siddharth: ఎయిర్‌పోర్టులో 20 నిమిషాల పాటు హెరాస్ చేశారు.. ఆవేదన వ్యక్తం చేసిన సిద్ధార్థ్

Highlights

Siddharth: తల్లిదండ్రులను అవమానించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన సిద్ధార్ధ్

Siddharth: "బొమ్మరిల్లు", "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" వంటి సూపర్ హిట్ సినిమాల తో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయమయ్యాడు. ఇటు తెలుగు, తమిళ్ మాత్రమే కాక హిందీలో కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ కరియర్లో ముందుకు దూసుకుపోతున్నాడు. అయితే తాజాగా సిద్ధార్ధ్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అభిమానుల సైతం షాక్ కి గురిచేస్తోంది.

మధురై ఎయిర్ పోర్టు లో సిద్ధార్ధ్ తల్లిదండ్రులను సిఆర్పిఎఫ్ అథారిటీస్ హరాస్ చేసినట్లుగా సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు సిద్ధార్థ్. చెకింగ్ పెరిట మధురై ఎయిర్ పోర్ట్ లో సిఆర్పిఎఫ్ అధికారులు సిద్ధార్ధ్ తల్లిదండ్రులను 20 నిమిషాల పాటు హెరాస్ చేశారట. ఈ పోస్ట్ అభిమానులను కూడా ఆందోళనకు గురిచేస్తుంది. "మధురై ఎయిర్ పోర్ట్ లో సిఆర్పిఎఫ్ వారు 20 నిమిషాల పాటు హరాస్ చేశారు. సీనియర్ సిటిజన్స్ అయిన నా తల్లిదండ్రులను తమ బ్యాగ్స్ నుంచి కాయిన్స్ కూడా తీసేయించారు. ఇంగ్లీషులో మాట్లాడమని వాళ్లు హిందీలో మాట్లాడారు. మన ఇండియాలో ఇలా ఎలా చేయగలిగారు," అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు సిద్ధార్థ్. "

పని పాట లేని వాళ్ళు పవర్ ని చూపిస్తున్నారు" అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో చాలామంది నెటిజన్లు మరియు అభిమానులు సిద్ధార్ధ్ కి సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేశారు. సినిమాలపరంగా చూస్తే ఈ మధ్యనే తెలుగులో "మహాసముద్రం" అనే సినిమాలో నటించారు కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంత పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది. తాజాగా ఇప్పుడు సిద్ధార్ధ్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న "భారతీయుడు 2" సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories