దక్షిణాసియా సెలబ్రిటీ దాతల జాబితాలో ప్రభాస్‌కు ఏడో స్థానం!

దక్షిణాసియా సెలబ్రిటీ దాతల జాబితాలో ప్రభాస్‌కు ఏడో స్థానం!
x
Highlights

బ్రిటన్ వారపత్రిక ఈస్టర్న్ ఐ' దక్షిణాసియా సెలబ్రిటీ దాతల జాబితాను వెల్లడించింది. సమాజం కోసం తారలు ఇచ్చే విరాళాలు, వారి సేవల ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. ఇందులో టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్‌కు ఏడోస్థానం దక్కింది.

బ్రిటన్ వారపత్రిక ఈస్టర్న్ ఐ' దక్షిణాసియా సెలబ్రిటీ దాతల జాబితాను వెల్లడించింది. సమాజం కోసం తారలు ఇచ్చే విరాళాలు, వారి సేవల ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. ఇందులో టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్‌కు ఏడోస్థానం దక్కింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభాస్ ప్రభుత్వాలకు రూ.4 కోట్ల విరాళం ఇచ్చారు. కరోనా క్రైసిస్ చారిటీ పట్ల కూడా ఉదారంగా స్పందించిన ప్రభాస్ రూ.50 లక్షలు ఇచ్చారు. అటు, పర్యావరణ హితం కోరి హైదరాబాద్‌కు సమీపంలోని ఖాజీపల్లి వద్ద 1,650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్నారు. అంతేకాకుండా, ఆ రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధి కోసం రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ అటవీ భూములను తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణరాజు పేరిట ఎకో పార్క్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభాస్ ముందుకు వచ్చారు.

ఇక, దక్షిణాసియా సెలబ్రిటీ దాతల జాబితాలో పాన్ ఇండియా నటుడు సోనూ సూద్ నెంబర్ వన్‌గా నిలిచారు. కరోనా లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ అందించిన సేవలు ఎనలేనివి. ముఖ్యంగా, దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూ సూద్ స్పందించిన తీరు అందరి ప్రశంసలకు నోచుకుంది. ఇప్పటికీ ఏదో ఒక రూపేణా సోనూ సూద్ దాతృత్వ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నవారిలో అందాల భామ ప్రియాంక చోప్రా 6వ స్థానంలో ఉండగా.. బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ 20వ స్థానంలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories