చిరంజీవి సినిమాలో నటిస్తున్న హీరో నితిన్

Hero Nithiin Acting With Chiranjeevi Movie | Tollywood News
x

చిరంజీవి సినిమాలో నటిస్తున్న హీరో నితిన్

Highlights

చిరంజీవి సినిమాలో నటిస్తున్న హీరో నితిన్

Chiranjeevi-Nithiin Movie: మెగాస్టార్ చిరంజీవి తన కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయనకి ఉన్న అనుభవం అలాంటిది. ఎక్కడైనా కథ విషయంలో డైరెక్టర్ చెప్పింది తేడా కొడుతుంది అని ఆయనకు అనిపిస్తే వెంటనే రైటర్ల తో మాట్లాడి సెట్ చేస్తారు. అందుకే ఒక సినిమా పూర్తి పూర్తయిన తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నారు చిరంజీవి. అలాంటి మెగాస్టార్ ఈసారి మూడు ప్రాజెక్టులను చాలా తక్కువ గ్యాప్ లో పట్టాలెక్కించేశారు.

ప్రస్తుతం మోహన్ రాజా డైరెక్షన్లో మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" అనే సినిమా తెలుగు రీమేక్ "గాడ్ ఫాదర్" సినిమాలో నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో "వాల్తేరు వీరయ్య" సినిమాలో నటించనున్నారు చిరంజీవి. శ్రుతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి "భోళా శంకర్" సినిమాని మొదలు పెట్టనున్నారు. ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ ఈనెల 22వ తేదీ నుంచి మొదలు కాబోతోంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం కీర్తిసురేష్ పాత్ర జోడీగా హీరో నితిన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో నితిన్ మరియు కీర్తి సురేష్ కలిసి "రంగ్ దే" అనే సినిమాలో నటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories