తాను పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని మరొకసారి నిరూపించుకున్న హీరో

Hero Kiran Abbavaram Has Once Again Proved that he is a Fan of Pawan Kalyan
x

తాను పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని మరొకసారి నిరూపించుకున్న హీరో

Highlights

ఫస్ట్ డే ఫస్ట్ షో రచ్చ ఆయన సినిమాలోనే అంటున్న కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "భీమ్లా నాయక్" సినిమా ఈనెల 25 వ తారీఖున విడుదల కాబోతున్నట్లుగా దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి యువ హీరో శర్వానంద్ హీరోగా నటించిన "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమా కూడా అదే రోజున విడుదల కాబోతుంది. అంతే కాకుండా కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన "సెబాస్టియన్ పీసీ 524" సినిమా కూడా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు కిరణ్ ను నిలదీశారు.

"పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుందని తెలియదా భయ్యా? ఆ డేట్ కి ఎలా వస్తున్నావ్? చాలా సార్లు పీకే ఫ్యాన్ అని చెప్పావు కదా. మరి ఏంటిది?" అని ఒక అభిమాని అడగగా కిరణ్ దానికి ఒక సర్ప్రైజ్ జవాబు ఇచ్చారు. "మీకంటే ఇంకొంచెం ఎక్కువనే వెయిట్ చేస్తున్నాను "భీమ్లా నాయక్" కోసం. నా మూవీ ఉన్నాసరే, ఫస్ట్ డే ఫస్ట్ షో రచ్చ ఆయన మూవీ లోనే" అని చెప్పుకొచ్చారు కిరణ్. తను నిజంగానే పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని మళ్ళీ నిరూపించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన "సెబాస్టియన్ పీసీ 524" సినిమా లో నమ్రత దరేకర్ మరియు కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జిబ్రాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories