రష్యా అమ్మాయిని ప్రేమించాను అంటున్న గోపీచంద్

Hero Gopichand Says He Loves a Russian Girl | Tollywood News
x

రష్యా అమ్మాయిని ప్రేమించాను అంటున్న గోపీచంద్ 

Highlights

*రష్యా అమ్మాయిని ప్రేమించాను అంటున్న గోపీచంద్

Gopichand: మ్యచో స్టార్ గోపీచంద్ తాజాగా ఇప్పుడు "పక్కా కమర్షియల్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మంచి అంచనాల మధ్య జులై 1వ థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా "ఆలీతో సరదాగా" షో లో పాల్గొన్నారు గోపీచంద్.

తన కరియర్ కి సంబంధించిన విషయాలను మాత్రమే కాక కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా ఆయన అభిమానులతో పంచుకున్నాడు. తన చిన్నప్పుడు ఒంగోలు చుట్టుపక్కల చెప్పుకోదగిన స్కూల్స్ ఉండేవి కాదని తన చదువు కోసం వాళ్ళ నాన్నగారు ఒంగోలు లోనే స్కూల్ పెట్టారని అన్నారు గోపీచంద్. సినిమాల్లో ఆయన బిజీ అయిన తరువాత నాన్న చనిపోవడంతో పరిస్థితులన్నీ మారిపోయాయని, ఆయన లేని లోటు తనను మరింత స్ట్రాంగ్ అయ్యేలా చేసింది అని అన్నారు.

"రష్యాలో ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒక రష్యన్ అమ్మాయి నచ్చింది. నేను కాలేజ్ కి వెళ్లే బస్సులోనే తను కూడా వచ్చేది. చాలా రోజుల కేవలం చూస్తూ ఉండేవాడిని కానీ ఇంకా ఎన్నాళ్లు ఇలా అనిపించిం నా మనసులోని మాటను చెప్పాను. కానీ తను నా కంట్రీ వేరు మీ కంట్రీ వేరు కనుక మా ఇంట్లో ఒప్పుకోరని చెప్పేసింది" అని తన మొదటి క్రష్ గురించి చెప్పుకొచ్చారు గోపీచంద్.

Show Full Article
Print Article
Next Story
More Stories