Allu Arjun: హీరో కాదు గజిని.. మళ్ళీ రేవంత్ పేరు మర్చిపోయిన బన్నీ.. కావాలనే చేసాడా?

Hero allu arjun forgot revanth reddy name after gaddar award 2024 announcement  telugu news
x

Allu Arjun: హీరో కాదు గజిని.. మళ్ళీ రేవంత్ పేరు మర్చిపోయిన బన్నీ.. కావాలనే చేసాడా?

Highlights

Allu Arjun: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు పురస్కారం లభించింది. గతంలో జరిగిన పరిణామాలతో తాజాగా అల్లు...

Allu Arjun: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు పురస్కారం లభించింది. గతంలో జరిగిన పరిణామాలతో తాజాగా అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డును ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనకు అవార్డు ప్రకటించడంపై ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి బన్నీ క్రుతజ్నతలు తెలిపారు.

పోస్టు చేసిన ట్వీట్ లో పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఈ అవార్డు రావడంపై దర్శకుడు సుకుమార్, పుష్ప చిత్రయూనిట్ పై బన్నీ ప్రశంసలు కురిపించాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి క్రుతజ్నతలు అని చెప్పారు. ఇందులో ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించలేదు. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. గతంలో ఓ సినిమా ఈవెంట్లోనూ పేరు మర్చిపోయాడనే కక్ష్యతోనే సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను జైలుకు పంపించారన్న ప్రచారం జరిగింది.

ఒక రోజు జైలులో ఉండటంతో దేశవ్యాపత్ంగా హాట్ టాపిగ్గా మారింది. ఇది రాజకీయంగా కూడా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవార్డులకు క్రుతజ్నతలు తెలపడంలో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వానికి అని ప్రస్తావించడం మినహా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఇది సోషల్ మీడియాలో రచ్చగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories