రివ్యూ: ఆకట్టుకోలేని 'జోడి'

రివ్యూ: ఆకట్టుకోలేని జోడి
x
Highlights

ప్రేమకావాలి సినిమాతో మంచి హిట్టు కొట్టిన హీరో ఆది అ తర్వాత లవ్లీ సినిమాతో పర్వాలేదు అనిపించాడు . ఇక అ తర్వాత హిట్టు కోసం తెగ ఆరాట పడుతున్నాడు ఆది .....

ప్రేమకావాలి సినిమాతో మంచి హిట్టు కొట్టిన హీరో ఆది అ తర్వాత లవ్లీ సినిమాతో పర్వాలేదు అనిపించాడు . ఇక అ తర్వాత హిట్టు కోసం తెగ ఆరాట పడుతున్నాడు ఆది .. ఈ క్రమంలోనే జెర్సీ మూవీ ఫేం శ్రద్దా శ్రీనాద్ తో కలిసి జోడి అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . మరి ఈ సినిమా అయిన ఆదికి మంచి హిట్టును అందించిందా లేదా అన్నది మన సమీక్షలో చూద్దాం ...

కథ:-

కపిల్ ( ఆది )నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తుంటాడు . అతని తండ్రి మాత్రం క్రికెట్ పై ఉన్న మోజుతో క్రికెట్ బెట్టింగ్లు కాస్తూ ఉంటాడు . ఈ క్రమంలోనే అతనికి కాంచనమాల (శ్రద్ధా శ్రీనాథ్) పరిచయం అవుతుంది . అ పరిచయం కాస్తా పెళ్ళికి దారి తీస్తుంది. కానీ కపిల్ తండ్రి చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల కపిల్ , కాంచనమాల పెళ్ళికి అడ్డుపడుతుంది . ఈ నేపధ్యంలో కపిల్ తన ప్రేమను దక్కించుకోవడంతో కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. ఇంతకి తన తండ్రి చేసిన తప్పేంటి ? చివరికి తన తండ్రితో బెట్టింగులు మాన్పించి కాంచనమాలను ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నది మిగిలిగిన కథ ...

ఎలా ఉందంటే : -

సినిమాల్లో ప్రేమ కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది .ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమాలోని పాత్రలను చూపిస్తూ , ఆసక్తికరమైన సన్నివేశాలను జోడిస్తూ స్క్రీన్ పైన ప్రేమ కథను అల్లితే ప్రేక్షకులకు నచ్చుతుంది . కానీ ఇందులో అలాంటి కథ-కథనాలు ఒక్కటి కూడా మనకి కనిపించవు .. కుటుంబ నేపధ్యంలో ఉన్న సన్నివేశాలు కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో ప్రేక్షకుడు నిరాశకు గురి కాక తప్పదు . దీనికి తోడు సినిమా కూడా స్లో నరేషన్ తో సాగడంతో ప్రేక్షకుడి సహనానికి ఓ పరీక్షలాగా మారుతుంది . హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ కథ కూడా పెద్ద ఆసక్తిగా కూడా అనిపించదు . సినిమాల్లోని కొన్ని కామెడి సీన్స్ బాగా పండాయి .. వెన్నల కిషోర్ ఉన్నంతలో బాగా నవ్వించాడు .

నటినటులు :-

మొదటి నుండి మంచి లవర్ బాయ్ గా ఆదికి మంచి పేరుంది .మధ్య మధ్యలో కొన్ని ప్రయోగాలు చేసినప్పటికీ మళ్ళీ లవర్ బాయ్ పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు . ఈ సినిమాలో కూడా ఓ లవర్ బాయ్ గా ఒకే అనిపించాడు . కానీ కొత్తదనం ఏమీ కనిపించలేదు . ఇక జెర్సీ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా శ్రీనాథ్ కి ఈ సినిమాలో బలమైన పాత్ర అయితే దక్కలేదు . ఉన్నంతలో బాగానే నటించింది . ఇక సీనియర్ యాక్టర్ నరేష్ నటన బాగుంది . మిగతా నటినటులు పాత్రల మేరకు ఒకే అనిపించారు .

సాంకేతిక వర్గం :-

సినిమాకి ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు , ఫణి కళ్యాణ్ సంగీతం సో సోగా ఉంది . ఇక ఎడిటర్ తన కత్తెరకి మరింత పని చెప్పాల్సి ఉంది . సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి .

చివరగా ఓ మాట : మెప్పించని ' జోడి '

గమనిక : ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. గమనించగలరు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories