Top
logo

హాలీవుడ్ రేంజ్ అంటే ఆయనది అంటున్న రానా

హాలీవుడ్ రేంజ్ అంటే ఆయనది అంటున్న రానా
Highlights

2018 లో సంచలనం సృష్టించిన హాలీవుడ్ సినిమాలలో అవెంజర్స్ కూడా ఒకటి. 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' అని టైటిల్తో...

2018 లో సంచలనం సృష్టించిన హాలీవుడ్ సినిమాలలో అవెంజర్స్ కూడా ఒకటి. 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' అని టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో మార్వెల్ సూపర్ హీరోలందరూ ప్రేక్షకులను అలరించారు. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ విడుదల కాబోతోంది. అసలే 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' క్లైమాక్స్ ప్రేక్షకులలో బోలెడు ప్రశ్నలను మిగిల్చింది. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో ముఖ్య విలన్ ధానోస్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన రానా స్వయంగా ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అవెంజర్స్ తో మీరు కూడా హాలీవుడ్లో సోలో సూపర్ హీరోగా నటిస్తున్నారా అని అడిగితే తనది హాలీవుడ్ రేంజ్ కాదని తాను కేవలం స్ట్రీట్ బాయ్ అని నవ్వేసారు రానా. అంతేకాక హాలీవుడ్ రేంజ్ అంటే ఆయనది అంటూ ఏ ఆర్ రెహమాన్ వైపు చూపించారు. ఇక తనకు అవెంజర్స్ సినిమా బాగా నచ్చుతుందని, సూపర్ హీరో సినిమాల్లో ఫిక్షన్ తను బాగా ఆకట్టుకుంటుందని, ఈ సినిమా లో ధానోస్ పాత్రకి వాయిస్ ఇచ్చే సమయంలో చాలా విషయాలను తెలుసుకున్నానని అన్నారు రానా. రానా లాంటి హీరో వాయిస్ అందించడం వల్ల సినిమా ఇమేజ్ పెరుగుతుంది అని మర్వెల్ సినిమా ప్రతినిధులు పేర్కొన్నారు.

Next Story