స్పెషల్ వీడియోతో అంచనాలు పెంచేసిన సినిమాలు ఏంటో తెలుసా..?

స్పెషల్ వీడియోతో అంచనాలు పెంచేసిన సినిమాలు ఏంటో తెలుసా..?
x
Highlights

సినిమా ప్రకటించి, క్రేజీ విజువల్స్‌తో కూడిన వీడియోలను విడుదల చేసి సినిమాలపై అంచనాలను పెంచేస్తున్నారు దర్శకులు.ఇటీవల కాలంలో అలా అంచనాలను పెంచేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సినిమా ప్రకటించి, క్రేజీ విజువల్స్‌తో కూడిన వీడియోలను విడుదల చేసి సినిమాలపై అంచనాలను పెంచేస్తున్నారు దర్శకులు.ఇటీవల కాలంలో అలా అంచనాలను పెంచేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జైలర్. దీనికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం జైలర్2. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన వీడియో ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. జైలర్‌కు మించి ఇందులో ఎలివేషన్స్ ఉంటాయని దర్శకుడు నెల్సన్ ఒక్క వీడియోతో చెప్పేశారు.

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో ది థగ్ లైఫ్ సినిమా తెరకెక్కగా ఈ సినిమా నుంచి విడుదలైన స్పెషల్ వీడియోకు సైతం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. శింబు, త్రిష, అభిరామి, నాజర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న కూలి సినిమాపై సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. గతేడాది కూలీ టైటిల్‌ను ప్రకటిస్తూ విందు ఉంది.. చిందు ఉంది.. మందు ఉంది.. సుఖం ఉంది.. అనుభవించే మనస్సు ఉందంటే, స్వర్గంలో చోటు ఉంటుంది. అంటూ విడుదల చేసిన వీడియో విశేషంగా అలరించింది.

రిషబ్ శెట్టి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న కాంతారా 1 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా..ఈసినిమా నుంచి విడుదలైన స్పెషల్ వీడియో అందరినీ అలరించడమే కాదు. భారీ అంచనాలు పెంచేసింది. గతంలో వచ్చిన కాంతారకు కొనసాగింపుగా ఈ మూవీ తెరకెక్కుతోంది.

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఓజీ.ఈ సినిమా మొదలు పెట్టిన కొద్దిరోజులకే విడుదల చేసిన స్పెషల్ వీడియో ఇప్పటికీ పవన్ అభిమానులకు బూస్ట్ ఇస్తూనే ఉంది. వాడు నరికిన మనుషుల రక్తాన్ని ఏ తుఫాను కడగలేకపోయింది అంటూ వచ్చిన వీడియోలో పవన్ ను చూసిన ప్రతిసారి గూస్ బంప్స్ వస్తాయంటున్నారు అభిమానులు. అంటే ఆ వీడియో అతని ఫ్యాన్స్ ను అంతలా ఆకట్టుకుందని చెప్పొచ్చు.

నాచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హిట్3. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాను మొదలుపెట్టే ముందు హిట్: ది థర్డ్ కేస్ .. హంటర్స్ కమాండ్ పేరుతో విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటుంది. ఇందులో నాని అర్జున్ సర్కార్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఇంతకుముందు విష్వక్ సేన్‌తో హిట్, అడివి శేష్‌తో హిట్ 2 సినిమాలను తెరకెక్కించిన శైలేష్.. మూడో భాగాన్ని నానితో తీస్తున్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. గతంలో ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఓ వీడియో బాగా ట్రెండ్ అయింది. గాజు పలిగేకొద్దీ పదునెక్కుద్ది అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ సినిమాలన్ని సూపర్ హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి స్పెషల్ వీడియోలతో అంచనాలను పెంచేసిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ తెచ్చుకుంటాయో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories