Kerala #Metoo: మలయాళం స్టార్ నవీన్ పాలీపై గ్యాంగ్ రేప్ ఆరోపణలు... అన్నీ అబద్ధాలే అంటున్న హీరో

Hema Committee Report Mollywood Sexual Harassment Case Actor Nivin Paul Sex Assault Mollywood Metoo
x

Kerala #Metoo: మలయాళం స్టార్ నవీన్ పాలీపై గ్యాంగ్ రేప్ ఆరోపణలు... అన్నీ అబద్ధాలే అంటున్న హీరో

Highlights

Kerala #Metoo: మలయాళ ఇండస్ట్రీని..హేమ కమిటీ ఇరుకున పడేసింది. పలువురు ప్రముఖ నటులపై లైంగిక ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై యాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ తోపాటు మిగతా సభ్యులు రాజీనామా చేయడం తదితర విషయాలు ఇంటెస్ట్రింగ్ మారాయి.

Kerala #Metoo: మలయాళ ఇండస్ట్రీని..హేమ కమిటీ ఇరుకున పడేసింది. పలువురు ప్రముఖ నటులపై లైంగిక ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై యాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ తోపాటు మిగతా సభ్యులు రాజీనామా చేయడం తదితర విషయాలు ఇంటెస్ట్రింగ్ మారాయి. ఇప్పుడు ప్రేమ్ సినిమాతో తెలుగోళ్లకు దగ్గరైన హీరో నివీన్ పౌలీపై ఓ నటి పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నివీన్ పౌలి స్పందించారు. మీడియా సమావేశం పెట్టారు. తనపై ఆరోపణలు చేసిన నటి ఎవరో తనకు తెలియదన్నారు.

తనన వేధింపులకు గురిచేశారంటూ ఓ యువ నటి ఫిర్యాదుతో హీరో నివీన్ పౌలి తో సహా మరో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. నటి ఆరోపణలను ఖండిస్తూ మంగళవారం అర్థరాత్రి నివీన్ పౌలి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇదొక కుట్రలా ఉందన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తుల్లో ఒకరు మాత్రమే తనకు తెలుసని తెలిపారు. ఎఫ్ ఐఆర్ నమోదు అయ్యింది. న్యాయపరంగా నేను పోరాడుతాను. నా నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎవరిపైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వారందరి కోసం నేను మాట్లాడుతున్నాను. నేను కూడా పోరాటం చేయకపోతే భవిష్యత్తులోనూ ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయన్నారు.

దాదాపు నెల రోజుల క్రితం ఇదే అమ్మాయి తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని నివీన్ తెలిపారు. కొంతకాలం క్రితం పోలీసులు నాకు ఫోన్ చేసి ఓ కేసు గురించి చెప్పారు. ఆమెవరో నాకు తెలియదని నేను చెప్పాను. విచారణ తర్వాత అది ఫేక్ కేసు అని తేలడంతో పోలీసులు దాన్ని క్లోజ్ చేశారని చెప్పారు. ఫేక్ కేసు పెట్టినందుకు నేను తిరిగి ఆమె ఫిర్యాదు చేద్దాము అనుకున్నా..కాకపోతే టైమ్ వ్రుధా అని పోలీసులు చెప్పడంతో నా నిర్ణయాన్ని మార్చుకున్నాను అని నివీన్ తెలిపారు.

ఆడిషన్స్ కోసం దుబాయ్ వెళ్లినప్పుడు తనను ఇబ్బందిపెట్టినట్లు సదరు మహిళ చెబుతున్నారు. ఈ విషయం గురించి తెలుసుకునేందుకు దర్శకుడికి పోన్ చేశాను. దుబాయ్ లో ఎలాంటి ఆడిషన్స్ నిర్వహించలేదని చెప్పారు. ఆమె ఎప్పుడు, ఎక్కడ నాతో సెల్ఫీ తీసుకున్నారో నాకు తెలియదు. ఎందుకంటే నటీనటులు బయకు వెళ్లినప్పుడు చాలా మంది ఫోటోలు తీసుకుంటారని నివీన్ తెలిపారు.

సినీఇండస్ట్రీకి చెందిన వ్యక్తులపై రోజుకో వార్త వస్తుంది. అందులో నిజం ఎంతో అబద్దం ఎంతో తెలియడం లేదు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అతని కుటుంబం బాధకు గురవుతుంది. ఇలాంటివి అడిగేందుకు ఎవరో ఒకరు ముందుకు రావాలి అందుకే నేను వచ్చాను అని తెలిపారు.

జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత ఇప్పటివరకు మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమకు ఎదురైన పరిస్థితులను ధైర్యంగా చెబుతున్నారు. దీంతో రోజుకో విషయం బయటకు వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories