HBD Ram Pothineni: రామ్.. నిన్ను బాగా మిస్ అవుతున్నా: ఛార్మి

పూరీ, రామ్, ఛార్మి (ఫొటో ట్విట్టర్)
HBD Ram: హీరోయిన్‌గా తెలుగు తెరపై రాణించిన ఛార్మి.. ప్రస్తుతం నిర్మాతగా పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది.
HBD Ram Pothineni: హీరోయిన్‌గా తెలుగు తెరపై రాణించిన ఛార్మి.. ప్రస్తుతం నిర్మాతగా పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పలు సినిమాలు కూడా తీశారు. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ త్రయం బంపర్ హిట్‌ను అందుకుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్‌లు కూడా రాబట్టి లాభాలు ఆర్జించి పెట్టింది. ఈ సినిమాతోనే హీరో రామ్ ఇమేజ్ టాలీవుడ్‌లో రెట్టింపైంది.
'రామ్.. నిన్ను బాగా మిస్ అవుతున్నా.. ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేం..' అంటూ ఈ యంగ్ హీరో పై ఛార్మి లవ్‌లీగా కామెంట్ చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటరా.. ఈ రోజు (మే 15)యంగ్ హీరో రామ్ పోతినేని పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో హీరోయిన్, నిర్మాత ఛార్మి బర్త్‌డే విషెస్ ట్విట్టర్లోతెలియ జేసింది. 'ఉస్తాద్... నిన్ను బాగా మిస్ అవుతున్నాం' అంటూ హీరో రామ్, డెరెక్టర్ పూరి జగన్నాథ్ లతో కలిసి దిగిన పిక్ షేర్ చేసింది. ''మన కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. సినిమా షూటింగ్ చేసినన్ని రోజులు ఎంతో సరదగా గడిపాం. లెట్స్ సెలబ్రేట్ సూపర్ సూన్'' అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది ఛార్మి.
ప్రస్తుతం రామ్ తన 19వ సినిమాను లింగుస్వామి డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ సినిమాలో 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా 'లైగర్' చిత్రాన్ని తీస్తున్నారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT