OTT: ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన హత్య సినిమా.. ఓటీటీలోకి వచ్చేసింది. ఎందులో అంటే

Hathya Movie Sparks Political Storm in Andhra Pradesh Now Streaming on OTT
x

OTT: ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన హత్య సినిమా.. ఓటీటీలోకి వచ్చేసింది. ఎందులో అంటే

Highlights

Hathya Movie: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హత్య సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే.

Hathya Movie: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హత్య సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తమ వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించారని ఇప్పటికే కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అలాగే సినిమా సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపైనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే దర్శకురాలు శ్రీవిద్య బసవ, నిర్మాత, రచయితలపై పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి.

జనవరి 24వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. అయితే సరైన ప్రచారం లేకపోవడం కారణంగా ఈ సినిమాపై పెద్దగా అందరి దృష్టిపడలేదు. అయితే తాజాగా రాజకీయాంశంగా మారడంతో ఒక్కసారిగా ఈ సినిమా హెడ్‌లైన్స్‌లోకి ఎక్కింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో తాజాగా ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ కథ ఏంటంటే.

ఈ సినిమా హత్య మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ప్రముఖ రాజకీయ నాయకుడి హత్య చుట్టూ కథ తిరుగుతుంది. ఈ కేసును ఒక పోలీస్ అధికారి ఎలా చేధిస్తాడనేదే కథాంశం. దర్శక-నిర్మాతలు సినిమా ప్రారంభంలో "ఇది కల్పిత కథ" అని స్పష్టం చేశారు. అయితే ఇది కల్పిత కథ కాదని ఒక నాయకుడి హత్యకు సంబంధించిందని స్పష్టమవుతోంది. ఇక ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ, రవి వర్మ, పూజా రామచంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్, శివాజీ రాజా, భరత్ రెడ్డి, రఘునాథ్ రాజు వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో టాప్-2 ట్రెండింగ్‌లో ఉన్న ఈ చిత్రం మరింత చర్చకు దారి తీసింది. ఏపీలో నమోదైన కేసుల కారణంగా మరింత ఆసక్తి రేకెత్తుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories