ముచ్చటగా మూడోసారి

Hat Trick Combinations
x
Hat Trick Combinations
Highlights

టాలీవుడ్ లో ముచ్చటగా మూడోసారి హిట్టు కొట్టేందుకు కొన్ని కాంబినేషన్స్ రెడీ అవుతున్నాయి. భారీ అంచనాల మధ్య ఈ సినిమాలు విడుదల అవుతున్నాయి.

టాలీవుడ్ లో ఇప్పుడు సక్సెస్ కాంబినేషన్స్ కొన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఇప్పటికే సినిమాని అనౌన్స్ చేసి ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచేశాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

అల్లు అర్జున్ -త్రివిక్రమ్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటికే జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలు వచ్చి మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో అల వైకుంఠపురములో అనే సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. ఈ సినిమాతో అలనాటి తార టబు రీఎంట్రీ ఇస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

బాలకృష్ణ- బోయపాటి

బోయపాటి సినిమా అంటే పక్కా మాస్.. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో బాలకృష్ణతో సింహ, లెజెండ్ అనే సినిమాలని చేసాడు బోయపాటి..ఈ సినిమాలు వారి కెరియర్ కి బాగా ఉపయోగపడ్డాయి. ఈ రెండు సినిమాల్లో బాలకృష్ణ డ్యుయల్ రోల్ లోనే కనిపించాడు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మూడో ససినిమా తెరకెక్కబోతుంది. ఇందులో బాలకృష్ణ ఎలా కనిపిస్తాడో చూడాలి మరి.

అల్లు అర్జున్ -సుకుమార్

ఇటు అల్లు అర్జున్ కెరియర్ ని అటు సుకుమార్ కెరియర్ ని టర్న్ చేసిన సినిమా ఆర్య.. లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. గీత ప్రేమ కోసం పరితపించే ఆర్య పాత్రలో అల్లు అర్జున్ చాలా బాగా నటించాడు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో ఆర్య 2 సినిమా వచ్చింది. ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి ఓ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.

రవితేజ- గోపిచింద్ మలినేని

సహాయ దర్శకుడిగా ఉన్న గోపిచింద్ మలినేనికి ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ రవితేజ డాన్ శీను అనే సినిమాని చేసాడు. ఈ సినిమా మంచి హిట్టు అయి దర్శకుడిగా గోపించంద్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో రవితేజ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో బలుపు అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అప్పటికి చాలా ఫ్లాప్ లలో ఉన్న రవితేజకి ఈ సినిమా మంచి విజయాన్ని ఇచ్చింది. ఇప్పుడు వీరిద్దరూ క్రాక్ అనే సినిమాని చేస్తున్నారు. ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. శ్రుతి హసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

నాని- ఇంద్రగంటి మోహన కృష్ణ

అష్టాచమ్మా సినిమాతో నాని హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు. ఈ సినిమాకి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో జెంటిల్ మెన్ అనే సినిమా వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి 'వి' అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నాని నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.. వచ్చే ఏడాది ఉగాదికి సినిమా విడుదల కానుంది.

రామ్ - కిషోర్ తిరుమల

చాలా ప్లాప్ లతో సతమతం అవుతున్న రామ్ కి నేను శైలజ సినిమా మంచి విజయాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో శైలు ప్రేమను దక్కించుకునే హరి పాత్రలో రామ్ చాలా అద్భుతంగా నటించాడు. ఆ తర్వాత ఫ్రెండ్ షిప్ నేపధ్యంలో ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రెడ్ అనే సినిమా తెరకెక్కుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories