సజ్జనార్ ను కడిగేయడానికి వస్తారు.. వారంతా ఇప్పుడేక్కడ..? హరీశ్ శంక‌ర్ సంచలన ట్వీట్

సజ్జనార్ ను కడిగేయడానికి వస్తారు.. వారంతా ఇప్పుడేక్కడ..? హరీశ్ శంక‌ర్ సంచలన ట్వీట్
x
Harish Shankar
Highlights

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు హరీశ్ శంక‌ర్. ఇక ఆయన సినిమాల్లో ఎమోషనల్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు హరీశ్ శంక‌ర్. ఇక ఆయన సినిమాల్లో ఎమోషనల్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ట్విట్టర్ లో హరీశ్ శంక‌ర్ సామాజిక అంశాల‌పై స్పందిస్తూ ఉంటాడు. అయితే తాజాగా పౌర‌, మాన‌వ హ‌క్కుల సంఘాలపై తన ట్విట్టర్ ఖాతాలో స్పందించాడు.

ఇటీవ‌ల కాలంలో ప్రాణాల‌కు తెగించి క‌రోనాపై పోరాడుతోన్న వైద్యుల‌పై కొందరు దాడుల‌కు తెగ‌బ‌డుతోన్న విష‌యం తెలిసిందే. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కూడా ఇటువంటి ఘ‌ట‌న జరిగింది. వైద్యుల పై జరిగిన దాడిని ముఖ్యమంత్రి కేసీఆర్ స‌హా మంత్రులంతా ఘ‌ట‌న‌ను ఖండించారు.

ఇదే విష‌యంపై డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "డాక్టర్లు, నర్సులు, పోలీస్ లు.. పౌరులు, మానవులు కాదా..!!? ఇటీవ‌ల‌ జరిగిన సంఘటనలపై పౌరహక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు పత్తా లేరు…!! సజ్జనార్ సార్ ను కడిగేయడానికి మాత్రం ….. తోసుకుంటూ ముందుకొస్తారు ….." అంటూ ట్విట్ట‌ర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories