పవన్ కళ్యాణ్ అభిమాని కి అదిరిపోయే హామీ ఇచ్చిన హరీష్ శంకర్

Harish Shankar Promised Pawan Kalyan Fan
x

పవన్ కళ్యాణ్ అభిమాని కి అదిరిపోయే హామీ ఇచ్చిన హరీష్ శంకర్

Highlights

Harish Shankar: భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన హరీష్ శంకర్

Harish Shankar: "అజ్ఞాతవాసి" సినిమా తర్వాత ఇండస్ట్రీకి కొన్నాళ్లు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా "భీమ్లా నాయక్" సినిమాతో మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకున్న పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" సినిమా చేస్తున్నారు. అంతే కాకుండా హరీష్ శంకర్ డైరెక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ నేపథ్యంలో ఒక అభిమాని పవన్ కళ్యాణ్ స్వాగ్ మిస్ అవుతోందని మళ్లీ అలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్నామని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

"ఆ స్టెప్పులు.. ఆ స్టైల్.. ఆ స్వాగ్.. ఏమైపోయావ్ కళ్యాణ్ అన్నా.. హరీష్ అన్నా మళ్లీ నీవల్లే అవుతుంది. ఇలాంటివి నీ సినిమాతో లాస్ట్ అనిపిస్తుంది," అని ఒక అభిమాని ట్విట్టర్లో హరీష్ శంకర్ కు ట్వీట్ చేయగా హరీష్ శంకర్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. "అన్నీ ఉంటాయి.. ఏది మిస్ అవ్వదు.. నన్ను నమ్మండి.. మన ఎదురుచూపులకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది," అని హామీ ఇచ్చారు హరీష్ శంకర్. ప్రస్తుతం హరీష్ శంకర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మళ్లీ పవన్ కళ్యాణ్ ని అంతకుముందు ఉన్న స్టైల్ మరియు స్వాగ్ తో చూపిస్తానని హరీష్ హరీష్ శంకర్ ప్రమాణం చేయడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories