భవదీయుడు భగత్ సింగ్ స్థానంలో మరొక కథను అడుగుతున్న పవన్ కళ్యాణ్

* స్క్రిప్ట్ నచ్చకపోయినప్పటికీ ఇప్పుడు మరొక స్క్రిప్ట్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ను మెప్పించే పనిలోపడ్డారు హరీష్ శంకర్.

R Tripura Malini
Updated on: 24 Nov 2022 8:30 PM IST
Harish Shankar is preparing a script for pawan kalyan other than bhavadeeyudu bhagat singh
X

భవదీయుడు భగత్ సింగ్ కాకుండా వేరే స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేస్తున్న హరీష్ శంకర్

Pawan Kalyan: ఈ మధ్యనే "వకీల్ సాబ్" మరియు "భీమ్లా నాయక్" సినిమాలతో మంచి హిట్లు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాకి "భవదీయుడు భగత్ సింగ్" అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు దర్శకనిర్మాతలు. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా తమిళ్లో విజయ్ హీరోగా నటించి సూపర్ హిట్ అయిన "తేరి" సినిమాకి రీమేక్ అని వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అసలు రీమేక్ సినిమానే కాదని తెలుస్తోంది. సినిమాని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారి దగ్గర "తేరి" సినిమా రీమేక్ రైట్స్ కూడా లేవు. అయితే పవన్ కళ్యాణ్ కోసం హరీష్ శంకర్ "భవతీయుడు భగత్ సింగ్" కథను రాసుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కు ఫైనల్ నేరేషన్ అంతగా నచ్చలేదట. ఈ నేపథ్యంలో ఈ కథను క్యాన్సిల్ చేసి మరొక కథతో రమ్మని పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కు చెప్పారట.

ఇలా ముందుగా అనుకున్న "భవదీయుడు భగత్ సింగ్" స్క్రిప్ట్ నచ్చకపోయినప్పటికీ ఇప్పుడు మరొక స్క్రిప్ట్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ను మెప్పించే పనిలోపడ్డారు హరీష్ శంకర్. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్" సినిమాలో నటించారు. బాలీవుడ్ లో "దబాంగ్" సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. మరి వీరిద్దరి కాంబోలో రాబోతున్న రెండవ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

R Tripura Malini

R Tripura Malini

Next Story