Hari Hara Veeramallu Review: ఇది వీరుడి గాథే!

Hari Hara Veeramallu Review: ఇది వీరుడి గాథే!
x

Hari Hara Veeramallu Review: ఇది వీరుడి గాథే!

Highlights

దాదాపు ఐదు సంవత్సరాల పాటు షూటింగ్ సాగిన "హరి హర వీరమల్లు" చివరికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలిసారిగా పీరియాడికల్ కథతో వచ్చిన ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు రేపింది. మరి ఈ సినిమా ఆ హైప్‌ను అందుకుందా?

దాదాపు ఐదు సంవత్సరాల పాటు షూటింగ్ సాగిన "హరి హర వీరమల్లు" చివరికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలిసారిగా పీరియాడికల్ కథతో వచ్చిన ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు రేపింది. మరి ఈ సినిమా ఆ హైప్‌ను అందుకుందా?

కథ

16వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ ఫిక్షనల్ కథలో, హరి హర వీరమల్లు (పవన్ కళ్యాణ్) వజ్రాలు మరియు ఇతర విలువైన వస్తువులు దొంగిలించి పేద ప్రజలకు పంచే దొంగ. చిన్న దొర (సచిన్ కేడ్కర్) గోల్కొండ నవాబులకు అప్పగించాల్సిన వజ్రాలను ముందుగానే దొంగిలించి తనకు అందించమని వీరమల్లుతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఈ క్రమంలో పంచమి (నిధి అగర్వాల్) పరిచయం అవుతుంది. అయితే వజ్రాలు దొంగిలించేటప్పుడు వీరమల్లు గోల్కొండ నవాబులకు చిక్కిపోతాడు. నవాబు, ఢిల్లీ మొగల్ చక్రవర్తి ఔరంగజేబు వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. వీరమల్లు ఎందుకు అంగీకరించాడు? కోహినూర్ కోసం అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అసలు వీరమల్లు ఎవరు? అనేది సినిమాలో చూడాల్సిందే.

విశ్లేషణ

దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్‌ను పెద్ద తెరపై చూడటం అభిమానులకు పండగలా అనిపించింది. పీరియాడికల్ స్టోరీ, పవర్‌ఫుల్ క్యారెక్టర్… ఇవన్నీ ఫ్యాన్స్‌కు కావలసిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి.

ఫస్ట్ హాఫ్: కథనం బాగా నడిచింది. పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, "కొల్లగొట్టినాది రా" పాట బాగున్నాయి. పులి, నక్క సీన్స్ హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేశాయి. కొన్ని చోట్ల పవన్ లుక్స్ సరిగ్గా సెట్ కాకపోయినా, ఐదు సంవత్సరాల పాటు షూట్ చేసిన సినిమాకి అది పెద్ద లోపం కాదు.

సెకండ్ హాఫ్: కథనం కొంచెం సడలిపోయింది. ముఖ్యంగా సీజీ వర్క్ చాలా నిరాశపరిచింది. హీరో గుర్రంపై వెళ్తున్న సీన్స్‌లో కూడా నేచురల్ ఫీల్ రాలేదు. గ్రాఫిక్స్, కెమెరా వర్క్ సరిగ్గా సెట్ కాలేదు. కానీ, కీరవాణి మ్యూజిక్ ప్రతి సారి సినిమాను మళ్లీ లేపింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్వయంగా డిజైన్ చేసిన "చౌకిదానా ఫైట్" సీన్ 20 నిమిషాల పాటు థియేటర్లలో హంగామా రేపుతుంది.

క్లైమాక్స్ మాత్రం అసంపూర్ణంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ సినిమా రెండు పార్ట్స్‌లో వస్తుంది. మిగతా కథ రెండో పార్ట్‌లో కొనసాగుతుంది.

నటీనటుల ప్రదర్శన

పవన్ కళ్యాణ్: వన్ మెన్ షో. యాక్షన్, డైలాగ్ డెలివరీ, స్వాగ్… అన్నీ పవన్ మార్క్‌లో ఉన్నాయి.

నిధి అగర్వాల్: సాంగ్స్, కొన్ని కీలక సీన్స్‌లో బాగుంది.

బాబీ డియోల్: ఔరంగజేబ్ లుక్‌కి సరిపోయాడు. కన్నులతోనే విలనిజం చూపించాడు.

సునీల్, రఘుబాబు, నాజర్, సుబ్బరాజు తమ పాత్రల్లో సరిపడ్డారు. అనసూయ ఓ పాటకే పరిమితం అయ్యింది.

సాంకేతిక విభాగం

మ్యూజిక్: కీరవాణి ఈ సినిమాకు ప్రధాన బలం. కొన్ని సీన్స్‌లో సినిమా బతికింది అంటే అది కీరవాణి మ్యూజిక్ వల్లే.

వీఎఫ్ఎక్స్: పెద్ద లోపం. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో నిరాశపరిచింది.

ఎడిటింగ్: కొంత వరకు మెరుగుపరచవచ్చు.

ప్లస్ పాయింట్స్

✅ పవన్ కళ్యాణ్ ప్రదర్శన

✅ ఫస్ట్ హాఫ్ కథనం

✅ ఇంటర్వెల్ ఎపిసోడ్ & ట్విస్ట్

✅ కీరవాణి మ్యూజిక్

మైనస్ పాయింట్స్

❌ వీఎఫ్ఎక్స్ & సీజీ వర్క్

❌ సెకండ్ హాఫ్‌లో ల్యాగ్

తుది నిర్ణయం

ఫ్యాన్స్‌కు హరి హర వీరమల్లు ఒక మంచి విజయం. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పవన్ కళ్యాణ్ అభిమానులు తప్పక చూడదగ్గ సినిమా.

Rating: ⭐⭐✨ (2.75/5)

Show Full Article
Print Article
Next Story
More Stories